Site icon HashtagU Telugu

Registration : ఇకనుండి తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ఈజీ గా చేసుకోవచ్చు

Registration Of Assets Tela

Registration Of Assets Tela

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) రిజిస్ట్రేషన్ (Registration ) ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కీలక చర్యలు చేపట్టింది. గతంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ (Registration of Assets) అనేది ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారేది. డాక్యుమెంట్లు సమర్పించడంలో ఆలస్యం, కార్యాలయాల వద్ద గంటల కొద్దీ నిరీక్షణ వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారంగా, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో “స్లాట్ బుకింగ్” విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి 47 కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 144 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వచ్చే నెల చివరికల్లా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Taliban Vs Chess : చెస్‌పై బ్యాన్.. తాలిబన్ల సంచలన నిర్ణయం.. ఎందుకు ?

ఈ కొత్త విధానం ద్వారా ప్రజలు ముందుగానే తగిన సమయానికి స్లాట్ బుక్ చేసుకొని, వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలో పని పూర్తి చేసుకోవచ్చు. అలాగే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తోంది. ఉదాహరణకు కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇద్దరు అదనపు సబ్ రిజిస్ట్రార్లను మరియు సిబ్బందిని నియమించారు. సాధారణంగా రోజుకు 48 స్లాట్ల వరకు సబంధిత సబ్ రిజిస్ట్రార్ నిర్వహించగలడని, దానికంటే ఎక్కువ అయితే మరింత సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది.

త్వరలో ఉప్పల్, మహేశ్వరం, మంచిర్యాల వంటి ప్రాంతాల్లో కూడా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమించే కార్యక్రమం చేపట్టనున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరు. కానీ గతంలో ప్రజలు ఎదుర్కొన్న అవ్యవస్థలు, ఆలస్యం, అధిక భర్తీ వంటి అంశాల వల్ల ఆదాయం పెరగలేకపోయింది. అందుకే ఈ కొత్త మార్పులతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాక, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.