Illegal Assets Case : శివబాలకృష్ణ డ్రైవర్‌, అటెండర్‌ అరెస్ట్.. వారి పేరిట కళ్లుచెదిరే ఆస్తులు

Illegal Assets Case : హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి లీలకు అంతులేదు.

Published By: HashtagU Telugu Desk
Illegal Assets Case

Illegal Assets Case

Illegal Assets Case : హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి లీలకు అంతులేదు. ఆయన చివరకు తన అటెండర్‌ హబీబ్, డ్రైవర్ గోపీ‌ పేరు మీద కూడా ఆస్తులను కూడబెట్టారు. దీనికి సంబంధించిన సమాచారం అందడంతో తెలంగాణ ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ అటెండర్‌ హబీబ్, డ్రైవర్ గోపీ‌లను అదుపులోకి తీసుకున్నారు. శివ బాలకృష్ణకు వచ్చే లంచం డబ్బులను తీసుకురావడంలో గోపీ, హబీబ్ కీలకంగా వ్యవహరించేవారని గుర్తించారు. దీనికి ప్రతిఫలంగా ఆ ఇద్దరి పేరుపై శివబాలకృష్ణపలు ఆస్తులను కూడబెట్టారట. డ్రైవర్ గోపీకి శివ బాలకృష్ణ హోండా సిటీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారట.దీన్నిబట్టి లంచాలు ఏ రేంజులో అందేవో అంచనా వేసుకోవచ్చు. వీరిద్దరి పేరు మీద ఉన్న బినామీ ఆస్తుల చిట్టాను బయటికి తీసే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమై ఉన్నారు.

Also Read :  Indian Family Killed : అమెరికాలో భారతీయ ఫ్యామిలీ హత్య ? దంపతులు, ఇద్దరు కవల పిల్లల మృతి

బినామీలకు ఇప్పటికే.. 

ఈ కేసుకు సంబంధించి శివ బాలకృష్ణ బినామీలకు ఇప్పటికే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. శివబాలకృష్ణకు  బినామీలు గా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు అందజేసింది. మరింత లోతుగా విచారించేందుకు.. విచారణకు హాజరుకావాలని వారికి సూచించారు. దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా విచారణ(Illegal Assets Case) జరుగనుంది.

We’re now on WhatsApp. Click to Join

మరోవైపు ఏసీబీ కస్టడీలో శివ బాలకృష్ణ వెల్లడించిన ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శివ బాలకృష్ణ ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు గుర్తించారు. 2021 నుంచి 2023లోనే కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో బయటకు వచ్చింది. యాదాద్రి జిల్లాలో శివ బాలకృష్ణకు 57 ఎకరాల భూమిపై ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

Also Read : Yahya Sinwar Video : గాజా టన్నెల్‌లో హమాస్ అగ్రనేత.. యహ్యా సిన్వార్ వీడియో ఫుటేజీ

  Last Updated: 14 Feb 2024, 04:05 PM IST