Free Power Supply: తెలంగాణ రైతులకు 24×7 ఉచిత విద్యుత్‌: ఠాక్రే

తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్ పై తీవ్ర చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Free Power Supply

New Web Story Copy 2023 07 12t193328.911

Free Power Supply: తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్ పై తీవ్ర చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. రేవంత్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల్ని నిండా ముంచుతుందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఓ ప్రకటన చేసింది.

తెలంగాణాలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంది. మూడు పంటలకు 24×7 ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న దానికంటే ఎక్కువే కాంగ్రెస్ ఇస్తుందని, తెలంగాణకు తమ పార్టీ ఎన్నికల వాగ్దానాలలో భాగంగానే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టు ఠాక్రే చెప్పారు. అలాగే వారికి ఇంకా ఏం ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నాం అని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌, కర్నాటకకు ఎన్నికల హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చిందని, తెలంగాణలో కూడా ఆ హామీని నెరవేరుస్తామన్నారు.

రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్‌ సరిపోతుందని, రెండు గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా అవసరం లేదని టీకాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. తానా వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన అమెరికా పర్యటన చేపట్టారు. అయితే అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణాలో రాజకీయంగా వివాదాస్పదంగా మారాయి.

Read More: World Cup 2023: గుడ్ న్యూస్.. వరల్డ్ కప్‌కు అయ్యర్ రెడీ (Video)

  Last Updated: 12 Jul 2023, 07:34 PM IST