హుజూరాబాద్.. దేశంలోనే రిచెస్ట్ ఉప ఎన్నిక!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోశించారు. ‘మిలియన్ మార్చ్’ పేరుతో విద్యార్థులను, యువకులను ఏకంగా చేశారు. తెలంగాణ ఉద్యమానికి తనవంతుగా పాటుపడ్డారు.

  • Written By:
  • Updated On - October 20, 2021 / 05:36 PM IST

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోశించారు. ‘మిలియన్ మార్చ్’ పేరుతో విద్యార్థులను, యువకులను ఏకంగా చేశారు. తెలంగాణ ఉద్యమానికి తనవంతుగా పాటుపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధన టీఆర్ఎస్ తోనే సాధ్యమైనా.. కోదండరాం పాత్ర కూడా ఉందని చెప్పక తప్పదు. త్వరలో ‘‘హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరుగుతుండటం, రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పుంజుకోవడం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘ముందస్తు’ లేదని చెప్పడం’’ లాంటి అంశాలపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ‘హ్యష్ ట్యాగ్ యూ’ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలే ఇవి..

కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?

తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏర్పడిన పార్టీ టీజేఎస్. అలాంటి పార్టీని ఇతర పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకించడం కోసమే ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తున్నాం. అంతే తప్ప టీజేఎస్ ను ఇతర పార్టీల్లో విలీనం చేయాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం పార్టీ బలోపేతం చేయడమే మా లక్ష్యం. మా సిద్ధాంతాలను పక్కన పెట్టి, వేరేవాళ్లను కలవడం సాధ్యంకాదు.

హుజూరాబాద్ లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు?

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలవడం ఖాయం. ఎందుకంటే ఆయనో సీనియర్ నాయకుడు. పైగా ఎన్నో ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. ఉద్యమ కారుడిగానూ ఆయను మంచి పేరుంది. కాబట్టి హుజూరాబాద్ ప్రజలు ఈటలను కోరుకునే అవకాశాలున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలో మాత్రం ధనం, మద్యం ప్రవాహం ఎక్కువగాఉంది. హుజూరాబాద్ ఎన్నికలు దేశంలోనే రిచెస్ట్ ఎన్నికలుగా భావించవచ్చు.

ప్రస్తుతం ఎన్నికలు కులాలు, మతాలకు ముడిపడుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్?

ఎన్నికల్లో కులాలు, మతాల పాచీక ఏమాత్రం పారదు. అదంతా కేవలం ఒక అపోహ మాత్రమే. ఒకవేళ కులాల ప్రతిపాదికన ఎన్నికలు జరిగితే, కేవలం 3 శాతం మాత్రమే ఓట్ల పడతాయి. ఎన్నికల్లో వీటికి ఏమాత్రం చాన్స్ ఉండదు. పోటీలో నిలిచే వ్యక్తి సమర్థడైన నాయకుడు కాదా? అవునా? అని మాత్రమే ప్రజలు బేరీజు వేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కుల ఎన్నికలు నడుస్తున్నాయి. కానీ తెలంగాణలో కుల ప్రభావం మాత్రమే తక్కువేనని చెప్పాలి.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకా.. తెలంగాణ రాజకీయాల్లో ఏమైనా మార్పులొచ్చాయా?

రేవంత్ రెడ్డి పీసీపీ చీఫ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే కాంగ్రెస్ ఊపందుకుంది. కాంగ్రెస్ కు కొత్త నాయకత్వం వచ్చినట్టు అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు రెవంత్ రెడ్డిని ఆదరిస్తున్నారు. రేవంత్ కు దమ్మున్ననాయుడిగా పేరుంది. అధికార పార్టీని ఎదుర్కోవడంలో రేవంత్ ముందున్నారు. భవిష్యత్తులో కచ్చితంగా రేవంత్ తో కలిసి పనిచేస్తాం.

కేసీఆర్ ను రేవంత్ ఢీకొడతారని మీరు భావిస్తున్నారా?

రేవంత్ రెడ్డి రాకతో తెలంగాణ రాజకీయాలు కొంతవరకు మారాయి. ఆయన సభలు, సమావేశాలకు జనాల నుంచి మంచి రెస్పాన్ వస్తోంది. ఒకవేళ రేవంత్ పాదయాత్ర చేస్తే, కచ్చితంగా సీఎం అయ్యే అకాశాలున్నాయి. అయితే కేసీఆర్ కున్న తెలివితేటలు రేవంత్ రెడ్డికి లేవని చెప్పొచ్చు. కేసీఆర్ దగ్గర లెక్కలేని డబ్బుంది. కాబట్టి కేసీఆర్ ఎదుర్కోవడంలో రేవంత్ విఫలం కావొచ్చు.

టీజేఎస్ ఎందుకు బలహీనంగా ఉంది?

మా పార్టీ ఏర్పడి రెండేళ్లు అవుతుంది. జనాల్లోకి వెళ్లడానికి ఇంకా టైం పడుతుంది. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడతాం. గ్రామాలవారీగా బస్సు యాత్రలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కార్యకర్తలను కూడా కాపాడుకోవాలి. అయితే అధికార పార్టీ వాళ్ల దగ్గర ఉన్న డబ్బులు మా దగ్గర లేవు.

కేసీఆర్ ముందస్తు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం?

కేసీఆర్ ముందస్తుకు కచ్చితంగా వెళ్తాడు. ఆయన కాదంటే అవునని, అవునంటే కాదన్నట్లు. ప్రతిపక్షాలు బలపడుతున్నాయి కాబట్టి కచ్చితంగా ముందస్తుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయాలో తీసుకుంటారో ఎవరికీ తెలియదు. కేసీఆర్ ఆలోచనా విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది.