Site icon HashtagU Telugu

TSPSC : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరామ్..?

kodandaram

kodandaram

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కొత్త చైర్మన్‌గా ప్రొఫెసర్ ఎం కోదండరామ్ నియమితులయ్యే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా కోదండరామ్‌ను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్య‌మ స‌మ‌యంలో ప్రొఫెసర్ కోదండరామ్ జేఏసీ చైర్మన్‌గా ప‌నిచేశారు. నిరుద్యోగుల కోసం ఆయ‌న ప‌లు పోరాటాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామ‌కాలు అంటూ ఆయ‌న ఉద్య‌మ స‌మ‌యంలో పోరాడారు. కోదండరామ్‌కు సాధారణంగా ప్రజల నుండి.. ముఖ్యంగా యువత నుండి ఆదరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత చైర్మన్‌ బి. జనార్దన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయగా, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆ రాజీనామాను ఆమోదించి ప్రధాన కార్యదర్శికి పంపించారు. దీంతో టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ ప‌ద‌వి ఖాళీగా ఉంది.

Also Read:  YSRCP : సీఎం జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వ‌బోతున్న సొంత జిల్లా ఎమ్మెల్యేలు.. జంపింగ్‌కు సిద్ద‌మైన ముగ్గురు ఎమ్మెల్యేలు..?