Priyanka Gandhi : ప్రియాంక గాంధీ 15 రోజులకొకసారి తెలంగాణకు వస్తారు.. రాబోయే ఎలక్షన్స్ పై రేవంత్ రెడ్డి కామెంట్స్..

రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడారు.

  • Written By:
  • Updated On - May 23, 2023 / 10:11 AM IST

కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్(Congress) గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఇక్కడ తెలంగాణ(Telangana) కాంగ్రెస్ నాయకులు తెగ సంబరపడిపోతున్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పలువురు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఇక్కడి నాయకుల్లో మరింత జోష్ వచ్చింది.

తాజాగా నేడు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), పలువురు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. రాబోయే ఎలక్షన్స్ గురించే చర్చలు జరిగినట్టు సమాచారం. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చార్లెస్ శోభరాజ్, దావూద్ ఇబ్రహీం, బిల్లా, రంగా.. ఈ నలుగురుకి కేసీఆర్ సమానం. కేసీఆర్ కి వందరోజుల కౌంట్ డౌన్ మొదలైంది. కేసీఆర్ తో చేతులు కలిపాక జేడీఎస్ సీట్లు తగ్గాయి. అక్కడే కేసీఆర్ ప్రభావం ఏంటో అర్థమైపోయింది. ఈసారి జరగనున్న ఎన్నికలు పేద, ధనిక ప్రజల మధ్య జరుగుతాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 88 సీట్లు వస్తాయి. తెలంగాణాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుంది. ఎలక్షన్స్ అయ్యేవరకు త్వరలోనే ప్రతి 15రోజులకు ఒకసారి ప్రియాంక గాంధీ తెలంగాణకి వస్తారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ తిరుగుతారు అని తెలిపారు.

ఇక త్వరలోనే మెదక్ లో ప్రియాంక గాంధీ సభ ఉండనున్నట్టు సమాచారం. మరి రేవంత్ అన్నట్టు ప్రియాంక ప్రతి 15 రోజులకు ఒకసారి తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తారా చూడాలి. కానీ కర్ణాటక ఇచ్చిన జోష్ తో ఈ సారి మాత్రం కొంచెం గట్టిగానే కష్టపడటానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

 

Also Read :  Revanth Reddy : 111 జీవో రద్దుపై రేవంత్ రెడ్డి ఫైర్.. రియల్ ఎస్టేట్ మాఫియా అంటూ..