నిరుద్యోగ సభలతో హోరెత్తిన తెలంగాణ కాంగ్రెస్ (TCongress) భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాద్ (Hyderabad) పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 8న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన సభలో ఆమె పాల్గొననున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 5నే ప్రియాంక గాంధీ తెలంగాణ వస్తున్నట్లు ముందు ప్రకటించారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రియాంక.. 5న రాలేనని పార్టీ వర్గాలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది.
తెలంగాణ పర్యటనను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. అందుకే ఏఐసీసీ తాజాగా ప్రియాంక షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 8న ప్రియాంక (Priyanka Gandhi) హైదరాబాద్ వస్తారని స్పష్టం చేసింది. అదే రోజు బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకొని.. ఢిల్లీ వెళ్లే ముందు హైదరాబాద్ వస్తారని తెలిపారు. కాగా, ప్రియాంక గాంధీతో రెండు మూడు బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ గతంలో నిర్ణయించింది. కానీ, ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కానీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా రిక్వెస్ట్ చేయడంతో చివరి నిమిషంలో 8వ తేదీన రావడానికి ఒప్పుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Pakistani drug smuggler: సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ చేతిలో హతమైన పాకిస్థానీ డ్రగ్స్ స్మగ్లర్స్