TS : రేపు రేవంత్ సర్కార్ ప్రారభించబోతున్న పథకాలకు బ్రేక్ పడబోతుందా..?

తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress)..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. అధికారం చేపట్టిన రెండో రోజే రెండు కీలక హామీలను నెరవేర్చిన సంగతి తెలిసిందే. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం తో పాటు ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచి ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకున్నారు. కాగా కొద్దీ రోజుల క్రితం ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజలు నుండి ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించింది. We’re now on WhatsApp. […]

Published By: HashtagU Telugu Desk
Gas Curent

Gas Curent

తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress)..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. అధికారం చేపట్టిన రెండో రోజే రెండు కీలక హామీలను నెరవేర్చిన సంగతి తెలిసిందే. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం తో పాటు ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచి ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకున్నారు. కాగా కొద్దీ రోజుల క్రితం ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజలు నుండి ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇందులో ముందుగా రూ.500 లకు గ్యాస్ (LPG cylinder At Rs 500) , 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ (200 Units Free Electricity Scheme) ను అమలు చేయాలనీ డిసైడ్ అయ్యింది. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం., కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) చేతుల మీదుగా శ్రీకారం చుట్టాలని భావించింది. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. కానీ ఇప్పుడు చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దైంది.

కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రేపు చేవెళ్లలో ప్రియాంక సమక్షంలో రెండు గ్యారెంటీల పథకాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. గ్యాస్‌ సిలిండర్, ఉచిత విద్యుత్‌ పథకాలను ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేయగా తాజాగా ఆమె పర్యటన రద్దు అయింది. మరి రేపు ఈ రెండు పథకాలను ప్రారంభిస్తారా..లేక మరో రోజు చూసుకొని ప్రారంబిస్తారా అనేది చూడాలి.

Read Also : Vantara : 600 ఎకరాల్లో అంబానీల అడవి ‘వన్‌తార’.. విశేషాలివీ

  Last Updated: 26 Feb 2024, 04:10 PM IST