Bhuvanagiri : విద్యార్థినితో వంట చేయించిన ప్రిన్సిపాల్.. నూనె పడి గాయాలు

Bhuvanagiri : వంట మనుషులు లేకపోవడంతో 8వ తరగతి విద్యార్థినితో వంట చేయించిన ప్రిన్సిపాల్‌ కు సంబంధించిన వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీసింది

Published By: HashtagU Telugu Desk
Survale Residential School

Survale Residential School

భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో(Survel Gurukula School) దారుణం చోటుచేసుకుంది. వంట మనుషులు లేకపోవడంతో 8వ తరగతి విద్యార్థినితో వంట (Cooking with an 8th student) చేయించిన ప్రిన్సిపాల్‌(Principal)కు సంబంధించిన వ్యవహారం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వంట చేస్తున్న సమయంలో విద్యార్థిని ఒంటిపై వేడి నూనె పడి (Hot oil fell on the stool) తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వ గురుకులాల్లో మౌలిక సదుపాయాల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధిత విద్యార్థికి తక్షణ వైద్యం అందించడంతోపాటు న్యాయం చేయాలని తల్లిదండ్రులు గట్టిగా నిలదీశారు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. తెలంగాణ గురుకులాల్లో కొనసాగుతున్న పరిష్కారంలేని సమస్యలకు ఇది నిదర్శనమని అన్నారు. 1971లో దివంగత పీవీ నరసింహారావు ప్రారంభించిన గురుకులాల స్థాయిని కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సర్వేల్ గురుకులం ఇప్పుడు ఈ దారుణ ఘటనకు కేంద్రంగా మారడం దౌర్భాగ్యమని హరీశ్‌రావు పేర్కొన్నారు.

గురుకులాల్లో సమస్యలపై ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. విద్యార్థుల భద్రత, మౌలిక సదుపాయాల నిర్వహణ విషయంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శలు గుప్పించారు. ఈ ఘటనతో ప్రభుత్వ గురుకులాల పరిస్థితి పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. గాయపడ్డ విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల సంఘం డిమాండ్ చేసింది.

Read Also : Fact Check : హైదరాబాద్‌లో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను కూల్చేశారా ? వాస్తవం ఇదీ

  Last Updated: 18 Dec 2024, 06:53 PM IST