Site icon HashtagU Telugu

PM MODI: నేడు తెలంగాణలో పర్యటించనున్న మోదీ, డుమ్మా కొట్టనున్న కేసీఆర్…!!

Modi Kcr

Modi Kcr

ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతోపాటు భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. ₹.2,268 కోట్లతో చేపట్టే పలు జాతీయ రహదారుల పనుల విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. వీటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తవ్వగా… కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబూ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆర్ఎఫ్సీఎల్ ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.

ఇవాళ మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో మోదీ తెలంగాణకు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతారు. అక్కడ బీజేపీ శ్రేణులు మోదీకి ఘనస్వాగతం పలుకుతారు. 2.10 గంటలకు తిరిగి బేగంపేట విమానశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా రామగుండం బయలుదేరుతారు. మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ కు చేరుకుంటారు మోదీ. 4.15 గంటలకు బహిరంగసభ వేదికకు చేరుకుని అక్కడ ప్రసంగిస్తారు మోదీ. 5.20 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్ చేరుకుంటారు. రాత్రి 8.50 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు.

అయితే మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావడం లేదు. ఇప్పటికే మోదీ రాష్ట్రంలో మూడు సార్లు పర్యటించారు. అయినప్పటిపీ మూడు సార్లు డుమ్మా కొట్టారు. ఇఫ్పుడు కూడా మరోసారి డుమ్మా కొడుతున్నారు. మొత్తం నాలుగు సార్లు మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ఆయన్ను కలవలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేట ఎయిర్ పోర్టు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. సాయంత్రం వీడ్కోలు కూడా పలుకుతారు. అయితే రామ గుండం ఫ్యాక్టరీలో తెలంగాణకు 11 శాతం వాటా ఉంది. అలాంటి కార్యక్రమానికి కూడా కేసీఆర్ హాజరుకాలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.