ఈనెల 12వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ఎరువుల కర్మాగారమైన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCLను మోదీ జాతికి అంకితం చేస్తారు. ఎన్టీపీసీ మైదానంలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలోనే సత్తుపల్లి, కొత్తగూడెం రైల్వేలైన్ కూడా అధికారికంగా ప్రారంభిస్తారు. వీటితోపాటుగా తెలంగాణకు మంజూరు అయిన మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను కూడా మోదీ రామగుండం వేదికగానే శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. సత్తుపల్లి, కొత్తగూడెం రైల్వే లైన్ ను బొగ్గు రవాణాకోసం నిర్మించారు. 927.94కోట్ల వ్యయంతో 54కిలీమీటర్ల మేర ఈ రైల్వే లైన్ను నిర్మించారు.
PM MODI: ఈనెల 12న రామగుండంకు ప్రధాని నరేంద్ర మోదీ..!!

Pmmodi