Site icon HashtagU Telugu

Modi Praises Bandi: శభాష్ సంజయ్! మన బలమేంటో చూపించావు.. జనాన్ని చూసి బండికి ప్రధాని ప్రశంసలు

Bandi And Pm

Bandi And Pm

పెరేడ్ గ్రౌండ్స్ లో జనాన్ని చూసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా హ్యాపీగా ఫీలైనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత జరిగిన ఈ విజయ సంకల్ప సభను చూసి ఎలాగైనా సరే భారీగా సక్సెస్ చేయాలని బీజేపీ నేతలు చాలా రోజుల నుంచి ఓ వ్యూహంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి తగిన ఫలితం ఈరోజు కనిపించడంతో.. మోదీ కూడా చాలా సంతోషపడినట్లు కనిపిస్తోంది.

విజయ సంకల్ప సభ వేదికపైకి వచ్చిన తరువాత ప్రధాని మోదీ.. స్టేజంతా కలియదిరుగుతూ ప్రజలందరికీ అభివాదం చేశారు. వేదికపై ఉన్న నేతలను కూడా పలకరించారు. తరువాత ఆయన సీట్లో కూర్చున్న తరువాత సభకు వచ్చిన జనాన్ని కాసేపు చూశారు. దీంతో ఆయన ఫుల్ ఖుషీ అయినట్లు అర్థమవుతోంది. వెంటనే తన పక్కన కూర్చున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డావైపు తిరిగి.. జనం భారీగా వచ్చారు కదా అని అన్నట్టుగా కనిపించింది.

నడ్డాతో మాట్లాడిన తరువాత ప్రధాని మోదీ.. తన ఎడమవైపు కూర్చున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వైపు తిరిగి ఆయనను అభినందించారు. జనసమీకరణ భారీగా జరిపావు. వెరీ గుడ్ జనం చాలామంది వచ్చారు అని అన్నట్టుగా తెలుస్తోంది. దానికి ప్రతిగా బండి సంజయ్ కూడా మోదీకి అభివాదం చేస్తూ.. ఇదంతా మన బలం సార్ అని అన్నట్టుగా సమాచారం.