మేడారం (Medaram) మహాజాతర సందర్బంగా ప్రధాని మోడీ ట్వీట్ చేసి భక్తులను ఆకట్టుకున్నారు. తెలంగాణలో అతి పెద్ద మహా కుంభవేళ గా భావించే మేడారం జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది ఈరోజు నుండి ఈ మహాజాతర మొదలైంది.ఈ సందర్భాంగా ప్రధాని మోడీ (PM Modi) తెలుగు లో ఈ మహాజాతర గురించి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం’ అని ట్వీట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈజాతరలో ప్రధాన ఘట్టం మొదటి రోజు అనగా బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు. మూడ్రోజుల పాటు భక్తుల పూజలు అందుకోనున్న దేవతలు తిరిగి శనివారం నాడు కన్నెపల్లి తీసుకువెళ్తారు. ఇక రేపు అనగా ఫిబ్రవరి 22న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి గద్దెపైకి తెస్తారు. జాతరలో చివరి రోజైన 24వ తేది నాడు గిరిజన దేవతలు వనప్రవేశం చేస్తారు. దీంతో మేడారం జాతర ముగుస్తుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ ఉత్సవాల కోసం తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తున్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యలు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధతో మేడారం పనులను పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేస్తూ పనులు చేయించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా మేడారం పర్యటించి పనులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో రివ్యూలు నిర్వహించి పనులను స్పీడప్ చేయించారు. మొత్తంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాతరను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు. రవాణా వ్యవస్థలో లోపాలు తలెత్తకుండా అధికారులు వాహనాల పార్కింగ్ స్థలాలను(Medaram Parking) గద్దెల కు దూరంగా ఏర్పాటు చేశారు. రోడ్ల వెడల్పు, నూతన రోడ్లు, రిపేర్లు చేసి ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకున్నారు.
Read Also : Priyamani : బాలీవుడ్ భామల గుట్టు విప్పిన అమ్మడు.. డబ్బులిచ్చి మరీ అలా చేయించుకుంటారట..!