Site icon HashtagU Telugu

Kavitha: తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని మోడీ… పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

Kavita

Prime Minister Modi who has not given a single rupee to Telangana... how can he become a big man?: Kavita

 

Kavitha: ఆదిలాబాద్ సభ(Adilabad Sabha)లో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi)ని పెద్దన్న అని సంబోధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిcm Revanth Reddyపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha)తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని మోడీ… పెద్దన్న ఎలా అవుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేననే విషయం తేటతెల్లమవుతోందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించలేదని ఎన్డీయే ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై కూడా కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ 3ని తీసుకు వచ్చిందని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోకు నిరసనగా ఈ నెల ఎనిమిదో తేదీ మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్లతో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మహిళలను, అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. రోస్టర్ విధానంతో మహిళలకు ఎక్కువమందికి ఉద్యోగాలు రాకపోయే ప్రమాదం ఉందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఆదిలాబాద్ కు వచ్చిన మోడీకి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. మోడీని రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు.

సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ… ఎన్నికల సమయంలోనే తాము రాజకీయాలు చేస్తామని, మిగిలిన సమయమంతా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరితో ఉంటే… రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. కేంద్రంతో తాము యుద్ధం చేయదలుచుకోలేదని చెప్పారు. ఒక పెద్దన్న మాదిరి ప్రధాని మోడీ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని చెప్పారు.

read also : Historic Milestone: 100వ టెస్టు ఆడ‌నున్న అశ్విన్‌, బెయిర్‌స్టో..!