PM MODI : ఆ తండాను మెచ్చిన ప్రధాని మోదీ…మన్ కీ బాత్ లో ప్రశంసలు..!!

ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తెలంగాణ గురించి ప్రస్తావించారు.

  • Written By:
  • Updated On - August 29, 2022 / 11:41 AM IST

ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తెలంగాణ గురించి ప్రస్తావించారు. వరంగల్ జిల్లా మంగ్త్యావాల్య తండాలో చేపట్టిన ఓ కార్యక్రమం గురించి ప్రధాని ప్రజలకు తెలియజేశారు. ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా అమృత్ సరోవర్ అభియాన్ లో కొత్తగా నీటికుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. యూపీ, మధ్యప్రదేశ్ లోనూ ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. మంగ్త్యావాల్య తండాలోనూ వర్షం నీటిని బొట్టు బొట్టుగా ఒడిసిపట్టేలా చేసిన పనుల గురించి ప్రజలతో పంచుకున్నారు ప్రధాని.

ప్రధాని మోదీ మాటల్లో….
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో గ్రామస్థులు తీసుకున్న అద్భుతమైన చొరవ గురించి నాకు తెలిసింది. అక్కడ నూతనంగా గ్రామపంచాయితీ ఏర్పాటు అయ్యింది. ఆగ్రామం పేరు మంగ్త్యావాల్య తండా. ఈ తండా అటవీప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. ఈ గ్రామ సమీపంలో వర్షాకాలం నీరు నిల్వ ఉండేలా ఓ కుంటను నిర్మించారు. గ్రామస్థులు ప్రత్యేక చొరవ తీసుకుని అమృత్‌ సరోవర్‌ అభియాన్‌ పథకం ద్వారా అభివృద్ధి చేసుకున్నారు. దీని ఫలితంగా వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా కుంట నీటితో నిండిపోయి కళకళలాడుతోంది.

 

Also Read: TDP @NDA : ఎన్డీయేలోకి టీడీపీ.. పొత్తుపై ముగిసిన చ‌ర్చ‌లు…?

 

అమృత్‌ సరోవర్‌ అభియాన్‌ పథకం ద్వారా రూ. 9.93 లక్షల ఉపాధి హామీ నిధులుతో తండాలో కొత్తగా నీటి కుంటను తవ్వారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో ఆ కుంట నీటితో నిండిపోయింది. దీంతో భూగర్భజలాలు కూడా పెరిగాయి. ఈ పథకం ప్రాముఖ్యతను తండా వాసులు వినియోగించుకున్న తీరును మోదీ ప్రత్యేకంగా ప్రస్తవించారు. తమ తండాపేరు ప్రధాని నోట రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.