Hyderabad Priest: ప్రేమ పేరుతో మహిళను లొంగదీసుకున్న పూజారి, ఆపై దారుణ హత్య!

నిత్యం పూజలు చేసే ఆలయ పూజారి ప్రేమ పేరుతో మహిళను లొంగదీసుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Pujari

Pujari

నిత్యం పూజలు చేసే ఆలయ పూజారి ప్రేమ పేరుతో మహిళను లొంగదీసుకున్నాడు. అక్కడి ఆగిపోకుండా గర్భవతిని చేసి హత్య చేశాడు. హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లోని ఓ ఆలయ పూజారి (Priest) 30 ఏళ్ల మహిళను హత్య చేశాడు.  వెంకట సూర్య సాయికృష్ణ అనే పూజారి అప్సరను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. కృష్ణ, అప్సర ఒక సంవత్సరం పాటు సంబంధంలో (Relation) ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అప్సర కొన్ని నెలల క్రితం గర్భవతి అయ్యింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో అబార్షన్ చేయించుకోవలసి వచ్చింది.

అయితే అప్పటికే వివాహితుడైన వెంకట సాయికృష్ణ అప్సరను వివాహం చేసుకోవడానికి నో చెప్పాడు.  సమస్య నుంచి దారి మళ్లించేందుకు డ్రైవ్ పేరుతో అప్సరను శంషాబాద్‌లోని సుల్తాన్‌పల్లెలోకి తీసుకెళ్లాడు. ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. ఆ తర్వాత మ్యాన్ హోల్ లో మృతదేహాన్ని (Dead Body) దాచిపెట్టాడు. అమ్మాయి బంధువుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు (Police) సిసిటివి ఫుటేజీని స్కాన్ చేయగా, కృష్ణ అమ్మాయి మృతదేహాన్ని సరూర్‌నగర్‌లోని మండల రెవెన్యూ కార్యాలయం (ఎంఆర్‌ఓ) సమీపంలోని మ్యాన్‌హోల్‌లో పడవేసి రెండు ట్రక్కుల ఇసుకతో కప్పినట్లు కనుగొన్నారు. అనుమానంతో మొదట కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా అప్సర హత్య (Murder) చేసినట్లు అంగీకరించాడు.

Also Read: Chiru leaks: చిరు లీక్స్.. తమన్నా, కీర్తి సురేశ్ లతో మెగాస్టార్ స్టెప్పులు!

  Last Updated: 09 Jun 2023, 05:36 PM IST