Vegetable Prices : సామాన్యులకు కూర‘గాయాలు’.. మండిపోతున్న ధరలు

కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. అవి ఇప్పుడు చికెన్ ధరలతోనూ పోటీపడుతున్నాయి.

  • Written By:
  • Updated On - May 29, 2024 / 02:21 PM IST

Vegetable Prices : కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. అవి ఇప్పుడు చికెన్ ధరలతోనూ పోటీపడుతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్‌లో టమాటా ధర రైతు బజారులోనే కిలోకు రూ.30 దాటేసింది. బహిరంగ మార్కెట్లలో కిలో టమాటా రేటు రూ.60 దాకా పలుకుతోంది. బీన్స్ రేటు కొండెక్కి కూర్చొని కిలోకు రూ.200కు చేరగా.. రైతు బజార్లలో దీని ధర  రూ. 155 ఉంది.  ప్రస్తుతం కేజీ గింజ చిక్కుడు ధర రూ. 85, పచ్చకాకర ధర రూ. 55, బెండకాయ ధర రూ. 45, పచ్చిమిర్చి  ధర రూ. 50 ఉంది.  బీరకాయ, సొరకాయ ధరలు కూడా తక్కువేం లేవు. వాటి రేటు కేజీకి రూ.60కిపైనే ఉంది. ఇక కొత్తిమీర చిన్నకట్ట ధర కూడా రూ.10 దాకా ఉంది.

We’re now on WhatsApp. Click to Join

సాధారణంగానైతే హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్లకు రోజుకు దాదాపు 5000  క్వింటాళ్ల కూరగాయలు(Vegetable Prices)  వస్తుంటాయి. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కావడంతో అంత స్థాయిలో కూరగాయలు రావడం లేదు. ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు రూ. 2800 టన్నుల కూరగాయలు మాత్రమే మార్కెట్‌కు వస్తున్నాయి. అందుకే ధరలు పెరిగిపోయాయి. ఒకవేళ ధరలు దిగి రావాలంటే నగరానికి ప్రతిరోజు అదనంగా మరో  3300 టన్నుల కూరగాయలు రావాలి. ఇది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే విషయం కాదు. వర్షాలు కురిసి కూరగాయల సాగు పెరిగితేనే హైదరాబాద్‌లోని మార్కెట్లకు కూరగాయల రాక పెరుగుతుంది. ఖరీఫ్‌ పంట కాలం జూన్‌ నెల నుంచి మొదలవుతుంది. ఆ తర్వాతే కూరగాయల ధరలు తగ్గే ఛాన్స్  ఉంది.

Also Read : Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ

ఎండలతో పాటు చికెన్‌ రేట్లు కూడా మండిపోతున్నాయి. కిలో చికెన్ ధర రూ.300  దాటేసింది. దీంతో మాంసాహార ప్రియులు అయ్య బాబోయ్ అంటున్నారు. ఎండల ధాటికి బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం, తగినంత దాణా తీసుకోకపోవడం వంటి కారణాలతో కోళ్ల బరువు పెరగడం లేదు. అందువల్లే చికెన్ రేట్లు పెరుగుతున్నాయి. స్కిన్‌లెస్‌ చికెన్ రేటు కిలోకు రూ.320 దాకా పలుకుతోంది.

Also Read :Rs 99 Movie Ticket : మే 31న మూవీ టికెట్స్ ధర రూ.99 మాత్రమే