Site icon HashtagU Telugu

Murmu Shedule: తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఇదే!

Murmu shedule

Murmu

రాష్ట్రపతి ద్రౌపదీ (President Murmu) ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణకు రానున్నారు. ఈనెల 30 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. ముర్ము పర్యటన సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 1500 మంది పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఉదయం 10.40కి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు.

శంషాబాద్‌నుంచి హెలికాప్టర్లో నేరుగా శ్రీశైలం వెళ్లనున్నారు రాష్ట్రపతి ముర్ము. ఉదయం 11.45కు సుండిపెంట హెలిప్యాడ్‌ చేరుకోనున్నారు. రోడ్డు మార్గం ద్వారా 12.05కు శ్రీశైలానికి చేరుకోనున్నారు రాష్ట్రపతి.

మధ్యాహ్నం 2.45 నిమిల వరకు ఆలయ దర్శనం అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సుండపెంట నుంచి బయలుదేరనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనున్నారు. సాయంత్రం 4.15కు హకీంపేట ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ చేరుకోనున్నారు.

రాష్ట్రపతి (President Murmu) తొలిసారి తెలంగాణ (Telangana)కు రానున్న సందర్బంగా.. రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ ఘనంగా స్వాగతం పలకనున్నారు. సికింద్రాబాద్ యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటిస్తారు… బొల్లారంలో వీరనారీలకు సత్కారం చేస్తారు.
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్

డిసెంబర్‌ 26

12.15 నుండి 12.45 వరకు శ్రీశైలం పర్యటన.. మధ్యాహ్నం 3.05 – 3.15 సికింద్రాబాద్ బొల్లారంలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి. వీరనారీలకు సత్కారం.

డిసెంబర్ 27

ఉదయం 10.30 – 11.30 నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం

మధ్యాహ్నం 3.00- 4.00 సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మారిషస్ మాల్దీవుల దేశాల అధికారులతో సమావేశం

డిసెంబర్‌ 28

ఉదయం 10.40 – 11.10 భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ సందర్శన. ప్రసాద్ పథకం ప్రారంభం. అనంతరం మిశ్ర ధాతు నిగం లిమిటెడ్(మిథాని)కి సంబంధించిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్ ను వర్చువల్ లు ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 3.00-3.30 వరంగల్‌లోని రామప్ప ఆలయ సందర్శన. ప్రసాద్ ప్రాజెక్టు ప్రారంభం… ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన

డిసెంబర్‌ 29

ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం.

సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి (శ్రీ రామానుజాచార్య) విగ్రహ సందర్శన
డిసెంబర్ 30

ఉదయం 10.00-11.00 రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగం.

అనంతరం సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభం.

మధ్యాహ్నం 1.00గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విందు ఇవ్వనున్న President Murmu రాష్ట్రపతి

Exit mobile version