భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) శీతకాల విడిది కోసం తెలంగాణ (Telangana) లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ముర్ము రానున్న నేపథ్యంలో హైదరాబాద్ బోలారం వద్ద ఉన్న రాష్ట్రపతి నిలయం చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు మొత్తం 1,500 మంది సిబ్బందిని మోహరించారు. జూలైలో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత రాష్ట్రపతి హోదాలో ముర్ము (President Murmu) హైదరాబాద్ కు రావడం ఇదే తొలిసారి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత రాష్ట్రపతి దక్షిణాదికి రావడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో మూడు నగర కమిషనరేట్స్ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ముర్ము టూర్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయని పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులు ఏరియా డామినేషన్ కసరత్తులు ప్రారంభించారు. భద్రతా పరంగా పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రపతి (President Murmu) భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుండగా, ప్రయాణికులకు కనీస అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు చేయనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ట్రాఫిక్ మళ్లింపులను వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
Also Read: Aditi Sidharth Dating: సిద్దార్థ్, అదితి డేటింగ్.. లేటెస్ట్ పిక్ వైరల్!