LB స్టేడియం లో రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరం

రేపు ఉదయం హైదరాబాద్ లోని LB స్టేడియం లో రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 10:55 AM IST

తెలంగాణ సీఎం (Telangana CM) గా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు , అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుండి తెలంగాణ లో దీపావళి ని తలపించేలా బాణా సంచా కలుస్తూ రేవంత్ కు జై.. జైలు పలుకుతున్నారు. ఇక రేపు ఉదయం హైదరాబాద్ లోని LB స్టేడియం (LB Stadium) లో రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబదించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ప్రమాణస్వీకారానికి సంబదించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. డీజీపీ రవి గుప్తా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ అనిల్‌కుమార్‌, హైదరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను వేదిక వద్ద ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇక నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి కి ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డి, బలరాంనాయక్‌ ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న రేవంత్‌కు తెలంగాణ భవన్‌ అధికారులు స్వాగతం పలికారు.

కొద్దీ సేపటి క్రితం కాంగ్రెస్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ బేటీలో మంత్రి వర్గ కూర్పు, వారి శాఖల కేటాయింపుపై ఇరువురు నేతలు చర్చించారు. గురువారం తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలని కేసీ వేణుగోపాల్‌ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అనంతరం ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు.

Read Also :  Telangana Ministers : ఖమ్మం నుంచి ఆ ఇద్దరిలో ఒక్కరికే మంత్రి ఛాన్స్ ?!

Follow us