Singareni Elections : సింగరేణి ఎన్నికలకు అంతా రెడీ.. ఎప్పుడు ?

Singareni Elections : ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి.

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 08:38 AM IST

Singareni Elections : ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 39,748 మంది ఓటర్లు  ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఇప్పటివరకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల పర్వం, స్క్రూటినీ పూర్తయింది. ఈనెల 6లోగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. 8న తుది జాబితా రిలీజ్ చేస్తారు. బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌తోపాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ సహా 13 సంఘాలు ఎన్నికల బరిలో ఉంటున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

కోర్టుకు వెళ్లిన కారణంగా విడుదల చేయని ఓటరు జాబితాను కూడా సింగరేణి విడుదల చేసింది. ఓటరు జాబితా ప్రతులను కార్మిక సంఘాలకు రిటర్నింగ్ అధికారి అందజేశారు. ఈ ఎన్నికల్లో 39,748 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారు. సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిన ఈనెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి 7గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం కోసం ఒకే ఓటు పద్ధతి అమలు చేస్తారు. గుర్తులను ఇప్పటికే కేటాయించారు.

Also Read: Cyclone Michaung : తీరం దాటిన తుఫాను.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

ఏరియాల వారీగా ఓటర్లు 

బెల్లంపల్లి ఏరియాలో 985 మంది ఓటర్లు, మందమర్రిలో 4876, శ్రీరాంపూర్‌లో 9124, కార్పొరేట్‌లో 1192, కొత్తగూడెంలో 2370, మణుగూరులో 2414, ఎల్లందులో 603, నైనీబ్లాక్‌లో 2, భూపాలపల్లిలో 5350, ఆర్జీ 1లో 5430, ఆర్జీ 2లో 3479, అడ్రియాలాలో 944, ఆర్జీ 3లో 3063 మంది ఓటర్లు(Singareni Elections) ఉన్నారు.