Site icon HashtagU Telugu

Telangana : గర్భిణీల కోసం ఫ్రీ ఆటో సర్వీస్​ చేపట్టి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు

Sahib Auto Driver

Sahib Auto Driver

ఈరోజుల్లో మనుషుల్లో స్వార్థం బాగా పెరిగింది..సాటి మనిషి ఆపదలో ఉన్నాడంటే అతనికి సాయం చేయడం అంటుంచి..చేసేవారిని కూడా చేయనివ్వడం లేదు. ప్రతిదీ కమర్షియల్ గా ఆలోచిస్తుంన్నారు. ఇలాంటి ఈరోజుల్లో ఓ తాపీ మేస్త్రి కొడుకు గర్భిణీల కోసం ఫ్రీ ఆటో సర్వీస్​ (Free auto service ) చేపట్టి..అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

నిర్మల్​ జిల్లా భైంసాలోని పిప్రీ కాలనీలో రాందాస్​ వయసు మీద పడటంతో కొన్నేండ్ల నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. ఆయన భార్య నాగమణి బీడీలు చుడుతూ కొడుకు సాహెబ్​రావుతో పాటు, మిగితా ఇద్దరు పిల్లల బాధ్యతని భుజానికెత్తుకుంది. కానీ, రానురాను ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో కొడుకు సాహెబ్ (Sahib)..ఇంటర్ తోనే చదువు మానేసి..ఓ ఆటో కొనుక్కున్నాడు. ఆటో నడుపుతూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏడాది కిందట సాహెబ్​ ఫ్రెండ్​కి కూతురు పుట్టింది. కానీ, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు వాళ్లకి. పుట్టిన కొద్దిరోజులకే పాప అనారోగ్యానికి గురికావడం తో.. హాస్పిటల్​కి వెళ్లడం ఆలస్యం కావడంతో ఆ చిన్నారి చనిపోయింది. ఆ సంఘటన​ తర్వాత చాలా రోజులు నిద్రపట్టలేదు సాహెబ్​కి.

Read Also : Andhra Pradesh : బీజేపీకి కొత్త అర్థం చెప్పిన ఏపీ కాంగ్రెస్ నేత తుల‌సి రెడ్డి

ఆ క్షణమే ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆ పాపకు ఎదురైనా పరిస్థితి మరొకరికి రాకూడదు అనుకున్నాడు. బాలింతలతో పాటు గర్భిణీలను టైంకి హాస్పిటల్​కి చేర్చడానికి ఫ్రీ ఆటో సర్వీస్​ చేయాలనీ అనుకున్నాడు. సాయం కావాలని ఎన్ని మైళ్ల దూరం నుంచి ఫోన్​ వచ్చినా రాత్రిపగలు, వారాలతో పనిలేకుండా వెళ్లడం మొదలుపెట్టాడు. వాళ్లని హాస్పిటల్​కి చేర్చడమే కాదు.. ట్రీట్మెంట్​ పూర్తయ్యాక మళ్లీ తన ఆటోలోనే ఇంట్లో దిగబెడుతున్నాడు. ఆడపిల్ల పుడితే పుట్టిన తేదీ నుంచి ఆరు నెలల వరకు ఫ్రీగా తన ఆటోలోనే చెకప్​కి తీసుకెళ్తున్నాడు. ఇలా గడిచిన ఎనిమిది నెలల నుంచి వందల మందికి సాయం చేశాడు..చేస్తూ వస్తున్నాడు. సాహెబ్ చేసే పనికి ఆ చుట్టుపక్కల ప్రజలే కాదు జిల్లా నుండి ఇప్పుడు రాష్ట్రం ..రాష్ట్రం నుండి దేశం మొత్తం మెచ్చుకుంటుంది. ప్రస్తుతం సాహెబ్ గురించి అంత ఆరా తీస్తున్నారు.