Police Physical Events: ఫిజిక‌ల్ ఈవెంట్స్ నుంచి వారికి మిన‌హాయింపు.. మెయిన్స్ రాసేలా వెసులుబాటు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ పోస్టుల‌కు ఫిజిక‌ల్ ఈవెంట్స్ (Physical Events) ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్‌ (Physical Events)లో గర్భిణులకు మినహాయింపునిచ్చారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో అర్హ‌త సాధించిన వారిలో ప‌లువురు మ‌హిళ‌లు గ‌ర్భిణులుగా ఉండ‌టంతో ఫిజిక‌ల్ ఈవెంట్స్‌కు హాజ‌రు కాలేక‌పోతున్నారు.

  • Written By:
  • Publish Date - December 28, 2022 / 08:55 AM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ పోస్టుల‌కు ఫిజిక‌ల్ ఈవెంట్స్ (Physical Events) ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్‌ (Physical Events)లో గర్భిణులకు మినహాయింపునిచ్చారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో అర్హ‌త సాధించిన వారిలో ప‌లువురు మ‌హిళ‌లు గ‌ర్భిణులుగా ఉండ‌టంతో ఫిజిక‌ల్ ఈవెంట్స్‌కు హాజ‌రు కాలేక‌పోతున్నారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని కోర్టు ఆదేశాల మేరకు పోలీస్‌రిక్రూట్ మెంట్ బోర్డ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన మహిళలు గర్భిణులుగా ఉండటంతో ఈవెంట్స్‌లో పాల్గొనకుండా మెయిన్స్ రాసేలా వెసులుబాటు కల్పించారు. బోర్డు నిర్ణయంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే నెలరోజుల్లోపు ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అధికారుల నియమావళిని అంగీకరిస్తూ గర్భిణీలు డిక్లరేషన్ ఇవ్వాలని నిబంధన విధించారు. అయితే మెయిన్స్ పరీక్షకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు TSLPRB పేర్కొంది. తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ 70శాతం మేర పూర్తయ్యాయి. దీంతో మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నామని TSLPRB ఛైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఫిజికల్ ఈవెంట్స్ మరో 8 నుండి 9 రోజుల్లో ముగుస్తాయని, ఆ వెంటనే మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈవెంట్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రిపరేషన్ పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని సూచించారు.