BRS New Plan : లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ‘కొత్త’ స్కెచ్ గీస్తోంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారట. సిట్టింగ్ అభ్యర్థుల్లో బలంగా ఉన్న ఒకరిద్దర్ని తప్ప మిగతా అన్నిచోట్లా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం పలువురు తటస్థులైన ప్రముఖుల్ని గులాబీ బాస్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని కేసీఆర్ సంప్రదించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి కొన్నిచోట్ల ఈవిధంగా ఎవరూ ఊహించని అభ్యర్థులను కేసీఆర్ బరిలోకి దింపే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు నల్లగొండ, పాలమూరు వంటి చోట్ల అనూహ్యమైన బీఆర్ఎస్ అభ్యర్థులు(BRS New Plan) రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత ఎన్నికల టైంలో..
గత ఎన్నికల టైంలో ఒక్కో బీఆర్ఎస్ లోక్‌సభ టిక్కెట్ కోసం సగటున ఐదు నుంచి పది మంది పోటీపడ్డారు. ఈసారి అంత పోటీ లేదు. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ ఇంకా ఆ సీటును ఎవరికీ ఖాయం చేయలేదు. చివరికి కేసీఆర్ కుటుంబ సభ్యులకూ టిక్కెట్లను ఇప్పటిదాకా ఖరారు చేయలేదు. చివరికి మెదక్ నుంచి కేసీఆర్ , నిజామాబాద్ నుంచి కవిత పేర్లను కూడా ప్రకటించలేదు. దీంతో వారిద్దరూ ఆయా స్థానాల్లో పోటీ చేయడం లేదని తేలిపోయింది. సిట్టింగ్ ఎంపీల్లో ఆరుగురికి ఈసారి మొండిచెయ్యే ఇవ్వబోతున్నారట. ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీకి 9 మంది లోకసభ సభ్యులు ఉండగా.. వారిలో ముగ్గురికి మాత్రమే ఈసారి పోటీ చేసే ఛాన్స్ దక్కొచ్చు. లోక్ సభ ఎన్నికలంటే జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. తమకే ఓటు వేయాలని ప్రజల్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే బీఆర్ఎస్ నుంచి పోటీకి అభ్యర్థులు వెనుకాడుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉండటంతో.. షెడ్యూల్ రాగానే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ స్థానాలు కీలకం..
- నల్లగొండ, భువనగిరి నియోజకర్గాల్లో బీఆర్ఎస్ టికెట్‌కు కొంత పోటీ ఉంది. గుత్తా సుఖేందర్ తన కుమారుడు పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ ఆయనకు కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వలేదు.
- మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయడానికి ఇటీవల టీడీపీ నుంచి పార్టీలో చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరును గతంలో అనుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. కాంగ్రెస్ బలపడింది. దీంతో అక్కడి నుంచి మరింత బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని గులాబీ బాస్ భావిస్తున్నారట.
- కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా ప్రకటించలేదు.
- ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పేరును కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. అక్కడి నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమే.
- నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన రేవంత్ రెడ్డిని కూడా కలిశారు.
- జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు ఈ సారి చాన్స్ ఉండదని భావిస్తున్నారు.