Pre-Election Cash : అభ్యర్థుల నామినేషన్స్ షురూ కాలేదు అప్పుడే రూ.400 కోట్లు సీజ్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (2023 Telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో పెద్ద ఎత్తున నగదు పోలీసులకు పట్టుబడుతోంది. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఎక్కడిక్కడే తనిఖీలు చేపడుతూ..నగదు , బంగారాన్ని (Seized Cash, Gold ) పట్టుకుంటున్నారు. నగదు , బంగారానికి సంబదించిన పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు రూ. 400 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు […]

Published By: HashtagU Telugu Desk
Pre Election Cash, Gold Sei

Pre Election Cash, Gold Sei

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (2023 Telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో పెద్ద ఎత్తున నగదు పోలీసులకు పట్టుబడుతోంది. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఎక్కడిక్కడే తనిఖీలు చేపడుతూ..నగదు , బంగారాన్ని (Seized Cash, Gold ) పట్టుకుంటున్నారు. నగదు , బంగారానికి సంబదించిన పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు రూ. 400 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అభ్యర్థుల నామినేషన్లు ఇంకా మొదలే కాలేదు..అప్పుడే ఈ రేంజ్ లో డబ్బు పట్టుబడితే..నామినేషన్స్ తర్వాత ఇంకా ఏ రేంజ్ లో పట్టుబడుతుందో అని అంత మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అక్టోబర్ 31నాటికి వీటన్నింటి విలువ సుమారు రూ.400 కోట్ల (Rs 400 cr ) మార్కును దాటిందని అధికారులు తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే రూ.16.16 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అక్టోబరు 9 నుంచి మొత్తం జప్తు రూ.412.46 కోట్లకు చేరిందని, ఇంత తక్కువ వ్యవధిలో దేశంలో ఇదే అత్యధికమని చెప్పారు. తెలంగాణలో 2018 ఎన్నికల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియలో మొత్తం నగదు, బంగారం స్వాధీనం కేవలం రూ.103 కోట్లు మాత్రమే అని చెపుతున్నారు.

చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం విడుదల చేసిన డేటా ప్రకారం, అక్టోబర్ 30 ఉదయం 9 నుంచి అక్టోబర్ 31 ఉదయం 9 గంటల మధ్య రూ.2.76 కోట్ల విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఇప్పటివరకు 251 కిలోల బంగారం, 1,080 కిలోల వెండి, వజ్రాలు, ప్లాటినం మొత్తం రూ.165 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నాయి. మద్యం సరఫరాపై కూడా అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో రూ.4.17 కోట్ల విలువైన మద్యం పట్టుబడగా, మొత్తం రూ.39.82 కోట్లకు చేరింది.

Read Also  : Daggubati Purandeswari : టీటీడీ ఫై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆగ్రహం

  Last Updated: 01 Nov 2023, 04:02 PM IST