YS Sharmila: ష‌ర్మిల పాద‌యాత్ర హిట్ కు `పీకే ` యంగ్ త‌రంగ్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 2017లో రాహుల్ గాంధీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్ వ్య‌వ‌హంచి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి వైఫ్య‌లాన్ని తెలంగాణ‌లో పీకే టీం చూస్తోంది.

  • Written By:
  • Updated On - November 7, 2021 / 12:06 AM IST

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 2017లో రాహుల్ గాంధీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్ వ్య‌వ‌హంచి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి వైఫ్య‌లాన్ని తెలంగాణ‌లో పీకే టీం చూస్తోంది. ఆనాడు పేట్ కీ చ‌ర్చ అంటూ రాహుల్ ను ముంచేశాడు. ఇప్పుడు యూత్ కీ చ‌ర్చ అంటూ షర్మిల ను ముందుకు న‌డిపిస్తున్నాడు పీకే. సాధార‌ణంగా పీకే టీం ఉంటే హ‌డావుడి ఉంటుంది. అందుకు భిన్నంగా ష‌ర్మిల పాద‌యాత్ర చాప‌కింద నీరులా సాగుతోంది.

వైఎస్సీఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల 18 రోజుల క్రితం పాద‌యాత్ర‌కు చేవెళ్ల వ‌ద్ద శ్రీకారం చుట్టారు. ఆరోజున కొంత మంది ఆమెను అనుస‌రించారు. ఇక ఆ త‌రువాత నుంచి ష‌ర్మిల అనుచ‌ర గ‌ణం మిన‌హా ఆమె పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌లు నామ‌మాత్రంగానే క‌నిపిస్తున్నారు. ప్ర‌జాస్థానం శ‌నివారంనాటికి 18వ రోజుకు చేరుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర క్రాస్ నుంచి ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభం అయింది. నాంపల్లి, చండూరు మండల్లాలో పాదయాత్ర కొనసాగింది. సాయంత్రం 4 గంటలకు బంగారిగడ్డలో మాటముచ్చటలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. అక్క‌డ స్పంద‌న అనుకున్నంత రాక‌పోవ‌డం ష‌ర్మిల టీంకు అంత‌బ‌ట్ట‌డంలేదు. పీకే టీం కూడా ఆమె వెంట ఉంది.

Also Read : ‘దళిత బంధు’కు బ్రేకులు పడినట్టేనా.. పథకం పున:ప్రారంభంపై ప్రభుత్వం మౌనం!

న‌ల్గొండ జిల్లా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ప్రాబ‌ల్యం ఎంతో కొంత ఉంటుంది. ఇటీవ‌ల ష‌ర్మిల పాద‌యాత్ర‌కు వెళ్ల‌డానికి ముందుగా ఆత్మీయ స‌మ్మేళనం నిర్వ‌హించింది. ఆ స‌మ్మేళ‌నానికి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి హాజ‌ర‌య్యాడు. స్వ‌ర్గీయ వైఎస్ఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాదు, ష‌ర్మిల్ పార్టీ ప‌ట్ల విధేయ‌త‌ను కూడా ప్ర‌ద‌ర్శించాడు. ఆ క్ర‌మంలో న‌ల్గొండ జిల్లా లో ష‌ర్మిల పాద‌యాత్ర సూప‌ర్ హిట్ అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న క‌నిపించింది.అక్టోబ‌ర్ 20వ తేదీని చేవెళ్ల నుంచి ప్ర‌జాప్ర‌స్థానం పాద‌యాత్ర‌ను ష‌ర్మిల్ ప్రారంభించిన విష‌యం విదిత‌మే. నిరంత‌రాయంగా 14 నెలలు పాటు 4 వేల కిలోమీటర్లు పాద‌యాత్ర చేయాల‌ని బ్లూ ప్రింట్ రూపొందించారు. తెలంగాణ‌లోని 90 నియోజక వర్గాల్లో ఈ పాదయాత్ర కొన‌సాగనుంది. ప్రతి రోజు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా కార్యాచరణ రూపొందించి, యువత లక్ష్యంగా ష‌ర్మిల ముందుకు క‌దిలారు.


`ఈ తరం యువతకు నవతరం` న్యాయకత్వం స్లోగన్‌తో షర్మిల పాదయాత్ర సాగుతోంది. ప్రతి రోజు రచ్చ బండ మాదిరిగా `మాట ముచ్చట` పేరుతో యూత్ తో ష‌ర్మిల ముఖాముఖి నిర్వ‌హిస్తున్నారు. ప్రతి నియోజక వర్గంలో మూడు మండలాలు టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. పాదయాత్రలో పార్టీలో చేరికలు.. గ్రామాల వారీగా పార్టీ బలోపేతంపై సమావేశాలు నిర్వహించాల‌ని పీకే టీం రూట్ మ్యాప్ ఖ‌రారు చేసింది. ప్రజాప్రస్థానం పాదయాత్రలో తొలిరోజు చేవెళ్ల.. వికారాబాద్‌ రోడ్డులోని కేజీఆర్‌ గార్డెన్‌ సమీపంలో బహిరంగ సభ జ‌రిగింది. ‌ షర్మిల ప్ర‌తి రోజూ 12 కిలోమీటర్లు పాద‌యాత్ర చేస్తున్నారు. ఆమె పాద‌యాత్ర‌ను చూసేందుకు పెద్దగా జ‌నం ఆస‌క్తి చూప‌డంలేదు. ఇలాంటి ప‌రిస్థితిపై పీకే టీం ప్ర‌త్యేక‌మైన అధ్య‌య‌నం చేస్తోంది. రాబోవు రోజుల్లోనైనా ష‌ర్మిల్ పాద‌యాత్ర‌ను హిట్ చేయ‌డానికి కొత్త వ్యూహాల‌కు పీకే ప‌దునుపెడుతున్నాడ‌ట‌. బెంగాల్ దీదీ యాక్సిటెంట్‌, జ‌గ‌న్ విశాఖ కోడిక‌త్తి..త‌దిత‌రాల‌ను చూశాం. ఇప్పుడు తెలంగాణ‌లో పీకే ఏం చూపించ‌బోతున్నాడో..మ‌రి!