Federal Front : ఫ్రంట్ మ‌హా ‘రివ‌ర్స్’

ప్ర‌శాంత్ కిశోర్ వ్యూహాలు బెడిసి గొడుతున్నాయి. కాంగ్రెస్‌, బీజేయేత‌ర ప్ర‌భుత్వాన్ని కేంద్రంలో నెల‌కొల్ప‌డానికి ఆయ‌న చేస్తోన్న ప్ర‌య‌త్నం రివ‌ర్స్ అవుతోంది.

  • Written By:
  • Publish Date - February 22, 2022 / 04:05 PM IST

ప్ర‌శాంత్ కిశోర్ వ్యూహాలు బెడిసి గొడుతున్నాయి. కాంగ్రెస్‌, బీజేయేత‌ర ప్ర‌భుత్వాన్ని కేంద్రంలో నెల‌కొల్ప‌డానికి ఆయ‌న చేస్తోన్న ప్ర‌య‌త్నం రివ‌ర్స్ అవుతోంది. తాజాగా మ‌హారాష్ట్ర సీఎం థాక‌రేను తెలంగాణ సీఎం కేసీఆర్ క‌లిశాడు. ఆ భేటీ వెనుక ప్ర‌శాంత్ కిశోర్ ఉన్నాడ‌ని టాక్‌. ఇటీవ‌ల ముంబాయ్ కేంద్రంగా బెంగాల్ సీఎం మ‌మ‌త‌, ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ భేటీని కూడా పీకే ఏర్పాటు చేశాడు. ఆ సంద‌ర్భంగా కాంగ్రెస్, బీజేపీయేతర‌ ప్ర‌భుత్వంపై చ‌ర్చ జ‌రిగింది. అంతేకాదు, యూపీఏ మ‌నుగ‌డ మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు పీకే, మ‌మ‌త చేయ‌డం గ‌మ‌నార్హం.గ‌తంలో చేసిన‌ థ‌ర్డ్ ఫ్రంట్ ప్ర‌యోగం విఫ‌లం అయిన విష‌యం చూశాం. ఆనాడు ఐకే గుజ్రాల్‌, చంద్ర‌శేఖ‌ర్‌, దేవెగౌడ త‌ద‌త‌ర‌ను థ‌ర్డ్ ఫ్రంట్ మార్చేసింది. కేవ‌లం రెండేళ్ల‌లోనే ప్ర‌ధాన మంత్రుల‌ను థ‌ర్డ్ ఫ్రంట్ మార్చాల్సి వ‌చ్చింది. ఆ ప్ర‌యోగాన్ని చూసిన దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్ తో కూడిన యూపీఏ వైపు మొగ్గు చూపారు. రెండు ప‌ర్యాయాలు వ‌రుస‌గా యూపీఏకి అవ‌కాశం ఇచ్చారు. ఇక బీజేపీతో కూడిన ఎన్డీయే వ‌రుస‌గా రెండుసార్లు అధికారాన్ని చేప‌ట్టింది. ప్ర‌స్తుతం ఎన్డీయే పాల‌న దేశంలో కొన‌సాగుతోంది. ఇలాంటి రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న థ‌ర్డ్ ఫ్రంట్ నిల‌వ‌డం క‌ష్ట‌మ‌ని ప‌లు ప్ర‌యోగాల ద్వారా తెలిసింది. ఇప్పుడు మ‌ళ్లీ కాంగ్రెస్, బీజేపీయేత‌ర ప్ర‌భుత్వం అంటూ మ‌మ‌త‌, కేసీఆర్ స్లోగ‌న్ అందుకున్నారు. స‌రిగ్గా ఈ పాయింట్ వ‌ద్దే వాళ్లిద్ద‌రికీ మ‌హారాష్ట్ర కేంద్రంగా వ్య‌తిరేక స్పంద‌న క‌నిపించింది.

కాంగ్రెస్ లేకుండా ప్ర‌త్యామ్నాయం సాధ్యంకాద‌ని ఆనాడు శ‌ర‌ద్ ప‌వార్ కామెంట్ చేశాడు. దీంతో యూపీఏ అనివార్యమ‌నే సంకేతాలు దేశ వ్యాప్తంగా విప‌క్షాల వ‌ద్ద‌కు వెళ్లాయి. తాజాగా మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ థాక‌రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కూడా థ‌ర్డ్ ఫ్రంట్ దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు స‌మాచారం. మహా రాష్ట్ర సీఎంవో కార్యాల‌యం మాత్రం కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ సాధ్య‌ప‌డ‌ద‌నే విషయాన్ని కేసీఆర్ కు తెలియ‌చేశార‌ట‌. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా పీకే బెంగాల్ లో ఆశించిన ఫ‌లితాల‌ను రాబ‌ట్టాడు. ఢిల్లీ ఎన్నిక‌ల్లోనూ కేజ్రీవాల్ కు చేదోడువాదోడుగా నిలిచాడు. ఇక బీహార్ ఎన్నిక‌ల్లో నితీష్ కు అండ‌గా నిలిచిన‌ప్ప‌టికీ ఊహించిన ఫ‌లితాలు రాబ‌ట్ట‌లేక‌పోయాడు. తాజాగా గోవా ఎన్నిక‌ల్లో టీఎంసీకు అండ‌గా పీకే ప‌నిచేస్తున్నాడు. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన త‌రువాత ఆయ‌న చేతులెత్తేశాడ‌ని తెలుస్తోంది. గోవా ఎన్నికల్లో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో కలిసి టీఎంసీ పోటీ చేసింది. ఎన్నిక‌ల బ‌రిలోని అభ్య‌ర్థుల‌కు పీకే ఎలాంటి స‌హ‌కారం ఇవ్వ‌డంలేద‌ని తృణ‌మూల్‌ కాంగ్రెస్ చీఫ్ కిరణ్ కండోల్కర్ ఆరోపిస్తున్నాడు.

సాధార‌ణంగా గెలిచే మూడ్ ఉండే పార్టీల ప‌క్షాన పీకే ఒప్పందం చేసుకుంటాడు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును గెలుపు దిశ‌గా తీసుకెళ్ల‌డానికి కొన్ని ప్ర‌యోగాలు చేస్తుంటాడు. అలాంటి ప్ర‌యోగం 2017 ఎన్నిక‌ల్లో యూపీలో చేశాడు. ఆనాడు పేట్ పే చ‌ర్చ అంటూ రాహుల్ ను న‌ట్టేట ముంచాడు. ఆ ఎన్నిక‌ల్లో పీకే వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌క్షాన. పీకే చేరాడు. ఆయ‌న‌కు స‌రైన్ గైడ్ గా ఉప‌యోగ‌ప‌డ్డాడు. అత్య‌ధిక సీట్ల మెజార్టీతో జ‌గ‌న్ గెలుపొందాడు. బీహార్‌, యూపీ, ఢిల్లీ లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితాల‌ను పీకే సాధించ‌లేదు. ఇప్పుడు తాజాగా కేంద్రంలో మూడో ప్ర‌త్యామ్నాయం దిశ‌గా పీకే అడుగులు వేస్తున్నాడు. అందుకోసం, మ‌మ‌త‌, కేసీఆర్, కేజ్రీవాల్‌, శ‌ర‌ద్ ప‌వార్ త‌దిత‌రుల‌తో పావులు క‌దుపుతున్నాడు. కానీ, మ‌హారాష్ట్ర కేంద్రంగా ఆయ‌న వేసిన అడుగులు కేసీఆర్‌, మ‌మ‌త ల భేటీ రూపంలో రివ‌ర్స్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎంత‌ వ‌ర‌కు పీకే వ్యూహాలు ఢిల్లీ పీఠంపై ప‌నిచేస్తాయో చూడాలి.