తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ కు మరో ఛాన్స్ ఇవ్వలేదు ప్రజలు..మార్పు కావాలంటూ కాంగ్రెస్ కి జై కొట్టారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ (Congress) రావడం తో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సీఎం అభ్యర్థిని కూడా ప్రకటిస్తే ఇక వారి సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఇదిలా ఉంటె ఓటమి చెందిన బిఆర్ఎస్ కు భరోసా ఇస్తున్నారు పలువురు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఎన్నికల ఫలితాల ఫై ట్వీట్ చేసారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నా.. కంగ్రాట్స్ టు కాంగ్రెస్.. థాంక్యూ కేసీఆర్, కేటీఆర్ ఫర్ ఎవ్రీథింగ్. మేము మీతో ఉన్నాం. తెలంగాణ కోసం మీ గుండె తపిస్తుందని మాకు తెలుసు. ఫలితాలు బాధించాయి. (ట్రోల్స్ చేసే వారికి స్వాగతం)’ అంటూ కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్‌కు ‘గెలిస్తే పొంగేది లేదు… ఓడితే కుంగేది లేదు..’ అని రాసి ఉన్న కేసీఆర్ ఫోటోను జత చేశారు. ఇక మొదటి నుండి కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ప్రకాష్ రాజ్ కు బిఆర్ఎస్ ఎంపీ పదవి ఇవ్వనున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అది జరగలేదు.
Read Also : Malla Reddy: బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి