హైదరాబాద్ధ : నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు. సమకాలీన రాజకీయాలపై, ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య వస్తోన్న మీమ్స్ ఎక్కువగా ప్రకాశ్ రాజ్ సినిమాల్లోని సీన్లతోనే వస్తున్నాయి.
ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలు, టమాటా ధరలను కంపైర్ చేస్తూ ఎక్కువ మీమ్స్ వస్తున్నాయి.
తాజాగా సింగం సినిమాలోని ఒక సన్నివేశం తీసుకొని దానికి టమాటా ధరలను కలిపి మీమ్స్ క్రియేట్ చేశారు. దాంట్లో సూర్యప్రకాశ్ రాజ్‌కు ఫోన్ చేసి పెట్రోల్ ధర 100 దాటింది అంటాడు. దానికి బదులుగా టమాటా ధర 110 రూపాయలకు చేరుకుందని ప్రకాష్ రాజ్ అంటాడు.
అయితే ఈ మీమ్ సోషల్ మీడియా ద్వారా ప్రకాశ్ రాజ్ కంట పడింది. దాన్ని వెంటనే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ప్రకాష్ రాజ్ దీన్ని ఎవరు క్రియేట్ చేశారు,ఏదో ఊరికే అడుగుతున్నా అని ట్వీట్ చేశారు. దీంతో ఆ మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Who did this …#justasking pic.twitter.com/Oq86O7sWNg
— Prakash Raj (@prakashraaj) November 25, 2021