Site icon HashtagU Telugu

HCU Land Issue : ప్రకాష్ రాజ్ రియాక్షన్

Prakashraj Hcu

Prakashraj Hcu

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సినీ నటుడు, రాజకీయ విశ్లేషకుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విద్యాసంస్థలకు కేటాయించిన భూములను వాణిజ్య అవసరాలకు మార్చడం అన్యాయమని, ఇది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. “ఈ విధ్వంసం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులు, పౌర సమాజం దీనికి వ్యతిరేకంగా నిలవాలి” అంటూ తన మద్దతును ప్రకటించారు.

Ratan Tatas Will: రతన్‌ టాటా రూ.10వేల కోట్ల ఆస్తి.. ఎవరికి ఎంత ?

HCU పరిధిలోని 400 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యాసంస్థల భూములు విద్యార్థుల అధ్యయనం, పరిశోధన అవసరాలకే పరిమితం కావాలని, ప్రభుత్వానికి చెందిన భూములైనా అవి విద్యార్ధుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించకూడదని ఉద్యమకారులు చెబుతున్నారు. ప్రకాష్ రాజ్ కూడా ఈ నిరసనలకు మద్దతుగా నిలిచారు. “విద్యాసంస్థల భూములు భవిష్యత్తు తరాలకు సాధనాలు. వాటిని వ్యాపార ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడం దారుణం,” అంటూ మరో ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

ఈ వివాదంపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఈ భూములు పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉన్నాయని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే విద్యార్థులు, ప్రొఫెసర్లు, పౌర సమాజం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయం ఏమిటనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.