Site icon HashtagU Telugu

Telangana BJP : దూకుడు పెంచిన బీజేపీ.. తెలంగాణ ఎన్నిక‌ల ఇన్‌ఛార్జిగా ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ..

Prakash Keshav Javadekar

Prakash Keshav Javadekar

2024లో జ‌రిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha election )మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు బీజేపీ (BJP) క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది. ప‌లు రాష్ట్రాల్లో బీజేపీలో కీల‌క మార్పులు చేస్తోంది. ఈ క్ర‌మంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే తెలంగాణ‌పై బీజేపీ అధిష్టానం ప్ర‌త్యేక దృష్టిపెట్టింది. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం ద్వారా అధికార‌మే ల‌క్ష్యంగా బీజేపీ పావులు క‌దుపుతోంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల రాష్ట్ర బీజేపీలో కీల‌క మార్పులు చేసింది. రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్‌ను తొల‌గించి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఈట‌ల రాజేంద‌ర్‌, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిలాంటి నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వుల‌ను అప్ప‌గించింది. తాజాగా బీజేపీ కేంద్ర పార్టీ అధిష్టానం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

మ‌రికొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌పై కేంద్ర బీజేపీ అధిష్టానం ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. ఈ క్ర‌మంలో రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జిలను నియ‌మించింది. చ‌త్తీస్ గ‌ఢ్ ఎన్నిక‌ల ఇన్‌ఛార్జ్‌గా ఓపీ మాథుర్‌, రాజ‌స్థాన్‌కు ప్ర‌హ్లాద్ జోషీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంకు భూపేంద్ర యాద‌వ్‌ల‌ను నియ‌మించిన బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంకు కేంద్ర మాజీ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌ను ఎన్నిక‌ల ఇన్‌చార్జ్‌గా నియ‌మించింది. స‌హాయ ఇన్‌చార్జ్‌గా సునీల్ బ‌న్స‌ల్ కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆధ్వ‌ర్యంలో బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరుణ్‌సింగ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

తెలంగాణ‌లో ఈనెల 8న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌లు అబివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గోనున్న ప్ర‌ధాని.. భారీ బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొంటారు. ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌కు ముందే రాష్ట్ర పార్టీలో కీల‌క మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే, పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌నుంచి బండి సంజ‌య్‌ను తొల‌గించ‌డం ప‌ట్ల బీజేపీలోని కొందరు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అధిష్టానం తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. వారిని సంతృప్తిప‌ర్చేలా సంజ‌య్‌కు కేంద్ర కేబినెట్‌లో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని కేంద్ర పార్టీ పెద్ద‌లు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లే టార్గెట్‌గా బీజేపీ పార్టీ దృష్టిసారించింది.. అయితే, బీజేపీ వ్యూహాలు ఏ మేర‌కు అమ‌ల‌వుతాయ‌నేది మ‌రికొద్ది నెల‌ల్లో తేల‌నుంది.

KTR: రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్ పర్సన్ గా సాయి చంద్ సతీమణి