ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం (Prajavani Programme ) నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో రేపటి నుండి ప్రజావాణి పునఃప్రారంభం కాబోతుంది. ఈ మేరకు ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా.జి.చిన్నారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ గా మార్చి అందులో ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఆ తరువాత నెమ్మదిగా తగ్గింది. ఇక ఇప్పుడు రెండు నెలల గ్యాప్ తర్వాత కార్యక్రమం మొదలుకావడం తో ప్రజల తాకిడి ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. అర్హులైన వారికి నేటి నుంచి గృహజ్యోతి స్కీమ్ కింద సున్నాబిల్లులు జారీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన కోడ్ ముగియడంతో తిరిగి ప్రతి ఒక్కరికి సంక్షేమం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు సున్నా బిల్లులను ప్రభుత్వం జారీ చేస్తుందని, ప్రజా ప్రభుత్వం అర్హులైన అందరికీ సంక్షేమం అందించనుందని పేర్కొన్నారు. కాగా ఇంటి అవసరాల నిమిత్తం 200 యూనిట్లకంటే తక్కువ కరెంటు వాడుకునే వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ స్కీమ్ ను రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి 27న సీఎం ప్రారంభించగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా ఈ స్కీమ్ అమలు కాలేదు. ఇప్పుడు కోడ్ ముగియడంతో నేటి నుంచి సున్నా బిల్లులు జారీ చేస్తామని మంత్రి ప్రకటించారు.
Read Also : Kangana Ranaut : ఎంపీ కంగనా రనౌత్ చెంప చెళ్లుమనిపించిన (CISF) కానిస్టేబుల్
