Site icon HashtagU Telugu

TS : రోడ్డు ఫై అభయహస్తం దరఖాస్తుల ఘటన ఫై ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు ఆఫీసర్లపై వేటు

Prajapalana Forms Road

Prajapalana Forms Road

బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పై ప్రజాపాలన దరఖాస్తులు పడిపోయిన ఘటన ఫై ప్రభుత్వం సీరియస్ అవుతూ..ఇద్దరు అభయహస్తం నోడల్ ఆఫీసర్లపై వేటు వేసింది. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. రీసెంట్ గా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి 30 లక్షల మంది గ్యారెంటీ పధకాలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ చేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై ప్రజాపాలన దరఖాస్తులు పడి ఉండడం అందర్నీ షాక్ లో పడేసింది. ఈ ఘటన ఫై బిఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రభుత్వం ఫై విమర్శలకు దిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పజెప్పిన అధికారి తీరుపై కన్నెర్రజేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో ఈ ఘటన ప్రభుత్వం సైతం సీరియస్ అయ్యింది. కుత్బుల్లాపూర్, హయత్ నగర్ అభయహస్తం నోడల్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. బాలానగర్, కుత్బుల్లాపూర్ లో ప్రైవేట్ వ్యక్తులకు అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ పని అప్పగించడంపై సీరియస్ అయ్యారు. ప్రజాపాలన కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా గత నెల (డిసెంబర్‌) 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి 30 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లోని వివరాలన్నింటినీ ఈనెల (జనవరి) 17వ తేదీలోపు కంప్యూటరీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం అభయహస్తం దరఖాస్తులను ఆన్ లైన్ చేసేందుకు కొందరు అధికారులు ఈ పనిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు.

అభయహస్తం దరఖాస్తులను కంప్యూటరీకరించే పనిని కూకట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఏజెన్సీకి కొందరు ప్రభుత్వ అధికారులు అప్పగించారు. దీంతో ధరఖాస్తులన్నీ ప్రైవేట్‌ ఏజెన్సీకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై ఓ యువకుడు AP39HH 6455 నెంబర్‌ గల స్కూటీపై అట్టపెట్టెలో వేలాది దరఖాస్తులను కుక్కి తీసుకెళ్తున్నాడు. నిన్న (సోమవారం) సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో అట్టపెట్టె తాడు తెగిపోవడంతో… అందులోని అభయహస్తం దరఖాస్తులు రోడ్డుపై పడిపోయాయి. అందులో కొన్ని దరఖాస్తులు గాలికి కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read Also : Guntur Kaaram Ticket Price : వామ్మో.. తెలంగాణ లో గుంటూరు కారం టికెట్ ధర రూ. 410