Site icon HashtagU Telugu

Abhaya Hastham : బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పై ప్రజాపాలన దరఖాస్తులు

Prajapalana Administration Balanagar

Prajapalana Administration Balanagar

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. రీసెంట్ గా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి 30 లక్షల మంది గ్యారెంటీ పధకాలను దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీటిని వెబ్ సైట్ లో ఆన్ లైన్ చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇప్పుడు బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై ప్రజాపాలన దరఖాస్తులు పడి ఉండడం అందర్నీ షాక్ లో పడేసింది.

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. కూకట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఏజెన్సీతో కంప్యూటరీంచేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెలో తరలిస్తుండగా తాడు తెగి రోడ్డుపై పడిపోవడం చూసి ప్రజలు ఆందోళన చెందారు.

We’re now on WhatsApp. Click to Join.

అతడి ముందు, వెనక ఉన్నవారు ఒక్కసారిగా వాహనాలు ఆపి, ఆ యువకుడికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఓ యూట్యూబర్‌ కూడా ఆ కాగితాలను తెచ్చి ఇచ్చే క్రమంలో అవేంటని చూసి అవాక్కయ్యాడు. స్కూటీపై ఉన్న యువకుడిని సదరు వ్యక్తులు నిలదీశారు. ఈలోగా ఇతర వాహనదారులు కూడా ఆ చుట్టుపక్కల కొట్టుకుపోయిన కాగితాలను తీసుకువచ్చి వాకబు చేశారు. ఇవన్నీ ప్రజాపాలన దరఖాస్తులని తెలుసుకొని ‘కోటి ఆశలతో పేదోళ్లు ఐప్లె చేస్తే ఎక్కడికి తీసుకుపోతున్నావ్‌’ అంటూ ప్రశ్నించారు. అవి హయత్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో నిరుపేదలు సమర్పించిన దరఖాస్తులని గుర్తించారు.

వాహనదారులు, యూట్యూబర్‌ నిలదీయడంతో తాను పాన్‌ డబ్బాలో పని చేస్తానని సదరు యవకుడు పేర్కొన్నాడు. మరి హయత్‌నగర్‌కు చెందిన దరఖాస్తులు ఎక్కడికి తీసుకుపోతున్నావని ప్రశ్నించగా… పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. ఒకసారి ఈసీఐఎల్‌కు చెందిన వ్యక్తినని, మరోసారి రామాయంపేటకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. అందరూ గట్టిగా నిలదీయడంతో తనకేమీ తెలియదని, లోకేషన్‌ మ్యాప్‌ ద్వారా వీటిని తరలిస్తున్నాననే విషయాన్ని స్పష్టం చేశాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పజెప్పిన అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : YS Sharmila : షర్మిల వెంట గుమ్మనూరు జయరాం..?