Telangana: తెలంగాణలో ప్రజాప్రభుత్వం.. ప్రజాదర్బార్, ప్రజావాణి కార్యక్రమాలు

ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన

Telangana: ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన కేటీఆర్, కవిత వ్యూహాలు ఫలించలేదు. అత్యాధునికంగా ప్రగతి భవన్ నిర్మించుకుని అక్కడే ఉండి రాజకీయం చేసిన కేసీఆర్ కు ప్రజలు గడీల దొరగా ముద్ర వేశారు. తెలంగాణ ప్రజలు అహంకారాన్ని ఉపేక్షించరని తెలుసుకోలేకపోయిన కేసీఆర్ అధికారాన్ని కోల్పోయి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ గేట్లు నేలకూలాయి. 12 అడుగుల ఎత్తులో ఉన్న గేట్లను తొలగించి ప్రగతి భవన్ లోకి ప్రజలకు ఎంట్రీ అవకాశం కల్పించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ లో ప్రతి శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుదిక్కుల నుంచి ఎవ్వరైనా రావొచ్చు, సీఎంతో నేరుగా మాట్లాడి సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది. సీఎం మాత్రమే కాకుండా ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజావాణి కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు. వారంగంలో మంత్రి కొండా సురేఖ ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు తరలి వచ్చారు.

నిజామాబాద్ లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 38 అర్జీలు అందాయి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్లు చిత్ర మిశ్రా, పి.యాదిరెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ ఎం. మకరంద్, జిల్లా ఉన్నతాధికారులు వివిధ సమస్యలపై అర్జీలు, దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాసమస్యలకు సంబంధించిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరియు తీసుకున్న చర్యల నివేదిక వివరాలను ప్రజావాణి సైట్‌లో అప్‌లోడ్ చేయాలి అని ఆయన అన్నారు.

Also Read: 2024 Holidays List : 2024లో ప్రభుత్వ సెలవులు ఎన్ని వచ్చాయో తెలుసా..?