Bandi Sanjay : నేడు నిర్మల్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం..!!

  • Written By:
  • Updated On - November 28, 2022 / 06:39 AM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ నిర్మల్ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగు దశలు ప్రజాసంగ్రామ యాత్రను నిర్వహించిన బండి సంజయ్ ఇవాళ ఐదో దశ యాత్రను ప్రారంభిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ…ప్రజల్లోకి వెళ్తున్నారు. పలు ముఖ్యమైన పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ యాత్రను చేపట్టారు బండి సంజయ్. దళిత బంధు, చేనేత బంధు, నిరుద్యోగ భ్రుతి, రైతు రుణమాఫీ వంటి పథకాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ చీఫ్ కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఐదో దశ సంగ్రామ యాత్రను చేపట్టారు.

ఐదు జిల్లాలు, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా ఈ సంగ్రామ యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్రతో జిల్లాలతోపాటు గ్రామస్థాయిలో కూడా బీజేపీకి ఆదరణ పెరుగుతుందని భావిస్తోంది. ఈ యాత్రలో భాగంగా నిర్వహించే బహిరంగ సభల్లో ప్రజలను మమేకం చేస్తూ…ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా బీజేపీ ఉంది. నిర్మల్ లోని అడెల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈ యాత్రను ప్రారంభించనన్నారు బండి సంజయ్. కాగా ఈ బహిరంగసభలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రసంగించనున్నారు. బైంసా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర …రాత్రికి గుండాగావ్ చేరుకుంటుంది. అయితే నిర్మల్ , బైంసా యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇవి సున్నిత ప్రాంతాలు కావడంతోనే భద్రతా కారణాల వల్ల పోలీసులు ఈయాత్రకు అనుమతి నిరాకరించారు.