Site icon HashtagU Telugu

Praja Palana : ప్రజాపాలన పేరుతో రేవంత్ మరో కార్యక్రమం

Prajapalana

Prajapalana

తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచారు. అధికారం చేపట్టగానే ప్రజా భవన్ (Prajabhavan) పేరుతో..ప్రజలు సమస్యలు తెలుసుకునే కార్యక్రమం చేపట్టగా..ఇప్పుడు పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి, అక్కడే సమస్యలకు పరిష్కారం చూపేందుకు ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు, పది రోజుల పాటు ప్రజాపాలన పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) శ్రీకారం చుట్టబోతున్నారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం, గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోనుంది. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా కసరత్తు చేస్తోంది. ఆదివారం కలెక్టర్లతో జరిగే సమాశంలో ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడనున్నారు. ముందుగా పది రోజుల పాటు గ్రామస్థాయిలో ప్రజాపాలన నిర్వహించనుంది. ఆ తర్వాత అవసరమైతే మరోసారి నిర్వహించడంపై ఆలోచన చేయబోతుంది.

Read Also : Nara Lokesh Arrest : నారా లోకేష్ ను అరెస్ట్ చేయబోతున్నారా..?