Praja Palana: చివరి రోజు 1.25 కోట్ల ప్రజా పాలన దరఖాస్తులు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ పథకాల కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 6వ తేదీ వరకు 1.25 కోట్ల మంది తెలంగాణ ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు.

Praja Palana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ పథకాల కోసం ప్రజాపాలన(Praja Palana) కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 6వ తేదీ వరకు 1.25 కోట్ల మంది తెలంగాణ ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే నేటితో దరఖాస్తుల గడువు ముగిసింది. దీంతో నిన్న చివరి రోజు కావడంతో ప్రజలు దరఖాస్తులు సంప్రదించడానికి పోటెత్తారు.

చివరి తేదీ నాటికి 16 లక్షలకు పైగా దరఖాస్తులు:
జనవరి 6వ చివరి తేదీ నాటికి 16,90,278 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిజ్ఞ చేసిన ఆరు హామీల కోసం ఈ దరఖాస్తులు ప్రాధాన్యత సంతరించుకుంది.రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం గ్రామాలు, పట్టణాల్లోనూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజాపాలన జరుగుతుందని, ఈసారి దరఖాస్తు చేసుకోలేని వారికి మరో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమార్‌ ఇదివరకే ప్రకటించారు.

దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు కసరత్తు:
జనవరి 6న కార్యక్రమం ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ అప్లికేషన్ అప్‌లోడ్ ప్రక్రియను ప్రారంభించింది, దీనికి గడువు జనవరి 17. ఈ పనులను మండల రెవెన్యూ, మండల అభివృద్ధి అధికారులు పర్యవేక్షిస్తారు. ప్రజాపాలన కోసం జిల్లా స్థాయి పర్యవేక్షక అధికారులు జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీని పర్యవేక్షిస్తారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని డిసెంబర్ 28న ప్రారంభించారు. రైతుబంధు, పింఛను పథకాల లబ్ధిదారులందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆరు హామీలలో ఐదు కింద ప్రయోజనాలను పొందేందుకు ఒక సాధారణ దరఖాస్తు ఫారమ్ అందుబాటులో ఉంచారు. మహిళలకు ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున నెలవారీ ఆర్థిక సహాయం, రూ.500కి వంటగ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు వంటి వివిధ వర్గాలకు నెలవారీ రూ.4,000, ఎకరాకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం. రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా రూ.12,000, ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం లాంటి పథకాలు ప్రజలకు అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ధరఖాస్తుల్ని స్వీకరించింది.

Also Read: Ram Lalla Idol : అయోధ్యలో కొలువుతీరబోయే బాలరాముడి విశేషాలివీ..