Site icon HashtagU Telugu

Praja Palana Program : 6 గ్యారెంటీలకోసం బారులు తీరిన ప్రజలు

Praja Palana Application Fo

Praja Palana Application Fo

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల (Congress 6 Guarantees) కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం (Congress Govt) ప్రకటించిన మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మొదలైన పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గాను ఈరోజు నుండి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ దరఖాస్తులకు ఆధార్ కార్డు(Aadhaar Card) జిరాక్స్‌తో పాటు, వైట్ రేషన్ కార్డు(Ration Card) జిరాక్స్‌ను కూడా జతచేయాలి. ఇలా నింపిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి అందించి..వాళ్లు అడిగిన వివరాలు చెప్తే.. వాళ్లు చెక్ చేసి దరఖాస్తు దారు ఏఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు. అలా.. దరఖాస్తు చివర్లో ఉన్న రశీదులో నమోదు చేసి.. సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఒక్క దరఖాస్తులోనే 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసుకునే వెసులుబాటు‌ ఉండటంతో మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు సంబంధించి అప్లికేషన్‌లు అందజేస్తున్నారు. అలాగే రేషన్‌కార్డు లేని వారు కొత్త రేషన్‌ కార్డుల కోసం కూడా అప్లై చేసుకుంటున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమం కోసం సీనియర్‌ IAS అధికారులను జిల్లాలకు నోడల్‌ ఆఫీసర్లుగా నియమించింది ప్రభుత్వం. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 6 జోన్లలో ప్రజాపాలన అమలు కోసం IAS అధికారులను నియమించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 సర్కిల్స్‌లో 30 మంది స్పెషల్ ఆఫీసర్స్, 10 వేల మందికిపైగా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.

Read Also : Damodar Rajanarasimha: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు మస్ట్: మంత్రి దామోదర్