Bandi Sanjay: ఆంజనేయస్వామి ఆశీస్సులతో ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించబోతున్నా : బండి సంజయ్

  • Written By:
  • Updated On - February 10, 2024 / 06:16 PM IST

Bandi Sanjay: ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించబోతున్నామని బీజేపీ ఎంపి బండి సంజయ్ అన్నారు. శనివారం అయన కొండగట్టు ఆలయంలో పూజలు జరిపారు. సంజయ్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో యాత్ర చేస్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల్లో యాత్ర కొనసాగిస్తాం. ప్రజల కోసం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేశాం. ప్రజాహిత యాత్ర లక్ష్యం ప్రధాని మోదీ ని మూడోసారి ప్రధాని చేయడం.

దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన మహానుభావుడు ప్రధాని నరేంద్ర మోదని అన్నారు. ఎంపిగా కరీంనగర్ పార్లమెంట్ కు ఏం చేశానో తెలియజేయడమే యాత్ర ఉద్దేశ్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధి కోసం నయా పైసా ఇవ్వలేదు. దేవుడ్ని నమ్ముకున్న ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. భారత్ మాతను విశ్వ గురు స్థానంలో నిలిపిన నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయాల్సిన అవశ్యకత దేశ ప్రజలపై ఉందని అన్నారు.

మేడిపల్లి నుంచి మొదలైన యాత్ర తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో  కొనసాగునుంది. మలివిడత ఈనెల 21 నుంచి యాత్ర రూట్ మ్యాప్ ఖరారు అయింది. మూడోసారి కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం..మోదీ ప్రధాని కావడమే లక్ష్యంగా యాత్ర కొనసాగనుంది. ఎంపీగా ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అయన ప్రజలకు  వివరిస్తున్నారు.  తొలివిడతలో ఈనెల 15 వరకు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో పాదయాత్రతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. అసెంబ్లీ వేదికగా జలాల గొడవపై, కాళేశ్వరం ప్రాజెక్టును విపక్షాలతో సీఎం సందర్శించే విషయంపై మాట్లాడేందుకు సంజయ్ నిరాకరించారు.