Site icon HashtagU Telugu

Praja Darbar 2nd Day : రెండోరోజు కూడా ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున పోటెత్తిన ప్రజలు

Praja Palana:

Praja Palana:

తెలంగాణ నూతన సీఎం రేవంత్ (Revanth Reddy)..తీసుకొచ్చిన ప్రజా దర్బార్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుంది. రెండో రోజు కూడా ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. వృద్దులు , వికలాంగులు , మహిళలు అధిక సంఖ్యలో వచ్చి తమ వినతి పత్రాలను అధికారులకు అందజేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ప్రజల అర్జీలను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి CCLA నవీన్ , IAS ముషారఫ్ అలీ స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ (Revanth Reddy)..తన మార్క్ పాలనను మొదలుపెట్టారు. పదేళ్లుగా కేసీఆర్ కు సొంతమైన ప్రగతిభవన్ ను కాస్త ప్రజా దర్బార్ (Praja Darbar) గా మార్చేయడమే కాదు..ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గత కొన్నేళ్లుగా ఉన్న ముళ్లకంచెను తొలగించి..ప్రజల దర్బార్ ను చేసారు. శుక్రవారం ఉదయం నుండే పెద్ద ఎత్తున పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వినతి పత్రాలతో ప్రజాదర్బార్ కు చేరుకోవడం మొదలుపెట్టారు. నిన్న సీఎం రేవంత్ దగ్గర ఉండి, ప్రజల సమస్యలు తీసుకుంటూ వారి వినతి పత్రాలను స్వీకరించారు.

బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను టార్గెట్ చేసిన రేవంత్‌ ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. కేసీఆర్‌ ప్రజల గోడు వినరని.. ప్రజంటే పట్టదని విమర్శలు గుప్పించిన రేవంత్‌.. తాను ప్రజాపాలన చేసి చూపిస్తానని జనానికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రగతిభవన్‌ను జ్యోతిరావ్‌పూలే ప్రజా భవన్‌గా పేరును మార్చారు. ప్రతి రోజు ప్రజా దర్బార్ లో ప్రజల సమస్యలకు సంబదించిన వినతి పత్రాలను స్వీకరిస్తామని తెలిపారు.