Site icon HashtagU Telugu

Praja Bhavan Inside Video : రాజ్ మహల్ ను తలదన్నేలా ప్రజాభవన్..అబ్బా ఏమన్నా ఉందా ..!!

Pragathibhavan Video

Pragathibhavan Video

పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) సకల సౌకర్యాలు అనుభవించిన ప్రగతి భవన్ (Pragathi Bhavan) ..ఇప్పుడు ప్రజా భవన్ (Praja Bhavan) గా మారింది. మొన్నటి వరకు బయట నుండి చూసేందుకు కూడా కుదరని విధంగా ఉండేది.. ఇనుప కంచెలు.. ముళ్ల కంచెలు.. మూడంచెల భద్రతతో కట్టుదిట్టంగా ఉండేది. అసలు భవనం లోపల ఎలా ఉంటుందో..? ఎంత పెద్దగా ఉంటుందో..? అని అంత అనుకునేవారు.. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా అందులోకి వెళ్లేలా చేసాడు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఇప్పుడు ఈ భవనం తాలూకా వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి అబ్బా ఏమన్నా ఉందా..! అంటూ అంత ఆశ్చర్య పోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజదర్పం తొణికిసలాడేలా కాస్ట్ లీ ఫర్నిచర్.. విశాలమైన హాల్.. అతి పెద్ద డైనింగ్ ఏరియా.. ఖరీదైన సోఫాలు.. కళ్లుజిగెల్ అనిపించే లైటింగ్‌.. ఇంద్ర భవనాన్ని మించేలా ఈ ఇల్లే చూసి అంత ఆశ్చర్య పోతున్నారు. కేసిఆర్ తాను నివసించడం కోసం ఇంత ఖరీదైన భవనాన్ని అన్ని వసతులతో ఏర్పాటు చేసుకున్నారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంతా ప్రజల సొమ్ముతో నిర్మించిందేగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసం గా వాడుకుంటున్నారు.

Read Also : MLC Kavitha: కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ కవిత