Site icon HashtagU Telugu

Rahul Pragathi Bhavan : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ‘ప్రగతి భవన్’ పేరును మారుస్తాం – రాహుల్

Rahul Gandhi Tweet

Rahul Gandhi

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని(Congress Party) అధికారంలోకి తీసుకరావాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) కంకణం కట్టుకున్నారు. తెలంగాణ ప్రజలు ఇంకోరుకుంటున్నారో..దానికి తగ్గట్లే మేనిఫెస్టో లను రిలీజ్ చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. ఇప్పటికే పలుసార్లు ప్రచారంలో పాల్గొన్న రాహుల్..ఈరోజు కూడా ప్రచారంలో పాల్గొని వరాల జల్లు కురిపించడమే కాదు అధికార పార్టీ బిఆర్ఎస్ ఫై విమర్శల వర్షం కురిపించారు. అలాగే సోషల్ మీడియా వేదిక కూడా పలు అంశాలను ప్రస్తావించారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తే సరికొత్త రాష్ట్రాన్ని చూస్తారంటూ రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు తెలంగాణగా మాత్రమే ఉందని.. ఆ తర్వాత ప్రజల తెలంగాణగా పిలుచుకునేలా అభివృద్ధిని చేసి చూపిస్తాం అంటూ మాటిచ్చారు. అంతే కాకుండా ఇప్పటి వరకు BRS పాలనలో ప్రగతి భవన్ గా ఉన్న భవనాన్ని కాంగ్రెస్ విజయం సాదిస్తే ప్రజా పాలనా భవన్ గా మారుస్తాము అంటూ తెలిపారు. ఈ భవనం యొక్క తలుపులు ఎనీ టైం తెరుచుకునే ఉంటాయంటూ తెలిపి మరింతగా ఆకట్టుకున్నారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తీసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండటంతో పాటు ప్రజా సమస్యలను 72 గంటల్లో పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తారన్నారు. జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన ప్రజా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజానీకం తమతో కలిసి రావాలని కోరారు. రాహుల్ గాంధీ ట్వీట్‌ను తెలంగాణ కాంగ్రెస్… ‘రాహుల్ గాంధీ సంచలన ట్వీట్’ అంటూ ట్వీట్ చేసింది.