Kick : ప‌వ‌ర్ ఫుల్ `చెప్పు` క‌థ‌లో డ్ర‌గ్స్, లిక్క‌ర్ రాజ‌కీయ `కిక్`

లిక్కర్ స్కామ్‌, డ్ర‌గ్స్ మాఫియా తెలంగాణ రాజ‌కీయానికి `కిక్`(Kick) ఇస్తోంది.

  • Written By:
  • Publish Date - December 21, 2022 / 03:31 PM IST

లిక్కర్ స్కామ్‌, డ్ర‌గ్స్ మాఫియా తెలంగాణ రాజ‌కీయానికి `కిక్`(Kick) ఇస్తోంది. ఈడీ చార్జిషీట్ లో క‌విత(kavitha) పేరు ఉంది. ఆమె ప్ర‌మేయాన్ని తెలియ‌చేస్తూ 28సార్లు చార్జిషీట్ లో పొందుప‌రిచారు. ఆ విష‌యాన్ని బీజేపీ తాజా లీడ‌ర్ రాజ‌గోపాల్ రెడ్డి ట్వీట్ ద్వారా లేవ‌నెత్తారు. మ‌రో వైపు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ ఠాకూర్ కూడా క‌విత‌పై ఈడీ వేసిన చార్జిషీట్ గురించి ట్వీట్ చేశారు. మ‌రిన్ని వివ‌రాలు క‌విత(Kavitha) నుంచి రావాల్సి ఉంద‌ని ట్వీట్ లో పొందుప‌రిచారు. దీంతో అటు రాజ‌గోపాల్ రెడ్డి ఇటు ఠాకూర్ ట్వీట్ల‌కు స‌మాధానం ఇస్తూ క‌విత ట్వీట్ల వ‌ర్షాన్ని కురిపించారు. చార్జిషీట్ లో 28సార్లు త‌న పేరును పెట్టినా 28వేల సార్లు పెట్టినా అబ‌ద్ధం నిజం కాద‌ని రీ ట్వీట్ చేయ‌డంతో లిక్క‌ర్ స్కామ్(Kick) పై ట్వీట్ వార్ మొద‌ల‌యింది.

రాజ‌కీయానికి `కిక్`(Kick)

బూక‌ట‌పు ఆరోప‌ణ‌లు అంటూ లిక్క‌ర్ స్కామ్ పై క‌విత ట్విట్ట‌ర్ వేదిక‌గా వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆమె చిత్త‌శుద్దిని నిరూపించుకోవ‌డానికి సిద్ధం అవుతున‌ట్టు చెబుతున్నారు. అబ‌ద్ధం ఎప్పుడు నిజం కాదంటూ అన్నా తొంద‌ర‌ప‌డొద్ద‌ని రాజ‌గోపాల్ రెడ్డికి సూచించారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో క‌విత ప్ర‌మేయం ఉంద‌ని కొన్ని నెల‌ల‌ క్రితం బీజేపీ లీడ‌ర్లు బ‌య‌ట‌పెట్టారు. అందుకు సంబంధించిన ఆధారాల‌ను ఢిల్లీ కేంద్రంగా సోష‌ల్ మీడియాలో ఉంచారు. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు అంద‌చేశారు. ఆ త‌రువాత విచార‌ణ చేసిన సీబీఐ తొలుత కోర్టుకు స‌మ‌ర్పించిన చార్జిషీట్ లో ఆమె పేరును పొందుప‌ర‌చ‌లేదు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ చీక‌టి ఒప్పందం అంటూ కాంగ్రెస్ రాజ‌కీయ ఆరోప‌ణ‌ల‌కు దిగింది. నిందితుడు ఆరోరా రిమాండ్ రిపోర్టులో క‌విత పేరును చూపుతూ సీబీఐ మ‌రో చార్జిషీట్ వేసింది. దాని ఆధారంగా క‌విత‌ను ఇటీవ‌ల ఆమె ఇంటిలో సీబీఐ అధికారులు విచార‌ణ చేశారు. మ‌రోసారి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సూచించారు. తాజాగా ఈడీ చార్జిషీట్ వేసింది. దానిలో క‌విత పేరును ప్ర‌ముఖంగా పొందుప‌రిచారు.

పొలిటిక‌ల్ గేమ్

ఇటీవ‌ల దాకా బీజేపీ, బీఆర్ఎస్ చీక‌టి గేమాడుతున్నాయ‌ని భావించిన వాళ్లు ఈడీ చార్జిషీట్ లో క‌విత పేరు చూడ‌గానే డౌట్ ను పూర్తిగా ప‌క్క‌న పెట్ట‌కుండా అరెస్ట్ ఎప్పుడు అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇదంతా ఇరు పార్టీల మ‌ధ్య పొలిటిక‌ల్ గేమ్ అంటూ కాంగ్రెస్ ఇప్ప‌టికీ న‌మ్ముతోంది. అయితే, ఎంపీ అర‌వింద్ , క‌విత మ‌ధ్య న‌డిచిన `కాలి చెప్పు` వివాదం బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య ర‌గ‌డ‌ను రేపింది. ఆయ‌న ఇంటి మీద బీఆర్ఎస్ సైన్యం దాడి చేసింది. కౌంట‌ర్ గా అర‌వింద్ రాజ‌కీయ ఎపిసోడ్ న‌డిపారు. ఇదంతా లిక్క‌ర్ స్కామ్ ను రాజ‌కీయంగా ర‌క్తి క‌ట్టించ‌డానికి ఆ రెండు పార్టీల మ‌ధ్య జ‌రిగే వ్యూహాత్మ‌క సీన్లంటూ కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది.

మంత్రి కేటీఆర్ మీద డ్ర‌గ్స్ కేసును తిర‌గ‌తోడ‌తామ‌ని ఇటీవ‌ల బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ‌యాత్ర ముగింపు స‌భ‌లో వెల్ల‌డించారు. ఆ మేర‌కు డ్ర‌గ్స్ కేసు క‌దులుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆ లోపుగా `వైట్ ఛాలెంజ్ `లు మంత్రి కేటీఆర్ ను ఉక్కిబిక్కిరి చేశాయి. ఒక వైపు బీజేపీ మ‌రో వైపు కాంగ్రెస్ నాయ‌కులు ఆయ‌న‌కు వైట్ ఛాలెంజ్ ల‌ను విసురుతూ సోష‌ల్ మీడియా, ప్ర‌జా వేదిక‌ల‌పైన స‌వాళ్లు చేస్తున్నారు. అయితే, బండి సంజ‌య్ స‌వాల్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. బొచ్చు, ర‌క్తం, కిడ్నీలు కూడా ఇస్తానంటూ క‌రీంన‌గ‌ర్లో మీడియా ముఖంగా ప్ర‌తి స‌వాల్ చేశారు. ఒక వేళ రిపోర్టుల్లో డ్ర‌గ్స్ ను గుర్తించ‌లేక‌పోతే, బండి సంజ‌య్ `చెప్పు`తో కొట్టుకోవాల‌ని సవాల్ విసిరారు. చెల్లెలు క‌విత ఇటీవ‌ల అర‌వింద్ కు ఇచ్చిన వార్నింగ్ మాదిరిగానే ఇప్పుడు మంత్రి కేటీఆర్ బీజేపీ చీఫ్ బండికి వార్నింగ్ ఇస్తూ స‌వాల్ చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయింది.`

కాలి చెప్పు` స‌వాల్

తెలంగాణ రాజ‌కీయాల్లోనే కాదు ఏపీలోనూ `కాలి చెప్పు` చూపుతూ రాజ‌కీయాన్ని జ‌న‌సేనాని ప‌వన్ ఇటీవ‌ల వేడిక్కించారు. గ‌తంలో త‌డి వ‌స్త్రాల‌తో ప్ర‌మాణానికి సిద్ధమంటూ ఏదో ఒక దేవుడి గుడిని చెబుతూ రాజ‌కీయాన్ని ర‌క్తిక‌ట్టించిన లీడ‌ర్లు చాలా మంది ఉన్నారు.ఆ ప‌రిణామం ఇప్పుడు `కాలి చెప్పు` దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఇటీవ‌ల `కాలి చెప్పు` స‌వాల్ చేసిన లీడ‌ర్లు చిన్నా చిత‌క వాళ్లు కాదు. ఒక‌రు జ‌న‌సేన పార్టీకి చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆయ‌న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల‌ను `చెప్పు`తో కొడ‌తానంటూ మైకు ముందు ఊగిపోయారు. ఆ రోజు ఆయ‌న చేసిన `చెప్పు` స్పీచ్ వారం పాటు ఏపీ రాజ‌కీయాన్ని వేడెక్కించింది. ఆ త‌రువాత అసలు ఇష్యూ మ‌రుగున‌ప‌డింది. ఇక ఇటీవ‌ల క‌విత తీసిన `చెప్పు` తెలంగాణ రాజ‌కీయాల‌ను ఇళ్ల మీద దాడుల వ‌ర‌కు తీసుకెళ్లింది. దీంతో లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారం కొన్ని రోజులు ప‌క్క‌దోవ ప‌ట్టింది. తాజాగా మంత్రి కేటీఆర్ తీసిన `చెప్పు` వ్య‌వ‌హారం డ్ర‌గ్స్ క‌థ‌ను మ‌లుపు తిప్పేలా క‌నిపిస్తోంది.

Also Read : Drugs Congress : డ్ర‌గ్స్ స్కామ్ పై `కాబోయే పీసీసీ` చీఫ్ వార్‌