Power of Congress : తెలంగాణ‌లో `ఛాన్స్`పై రాహుల్ అస్త్రం

Power of Congress : తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని నేత‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు. ఆ దిశ‌గా ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 05:17 PM IST

Power of Congress : తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీలు నేత‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు. ఆ దిశ‌గా దూకుడుగా ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్నారు. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఎన్నిక‌ల‌ను డీల్ చేయ‌డానికి స‌ర్వం సిద్ధం చేసుకున్నారు. క‌ర్ణాట‌క త‌ర‌హాలో గెలుపు అందుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. అంతా బాగుంద‌ని భావిస్తోన్న టైంలో కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌లు ఆ పార్టీని ఆలోచింప చేసేలా ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

తెలంగాణ‌లో అధికారంలోకి అవ‌కాశం (Power of Congress)

రాబోవు రోజుల్లో చ‌త్తీస్ గ‌డ్, రాజ‌స్థాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు జ‌ర‌గ‌బోతున్నాయి. వాటిల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్ గ‌డ్‌, రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని రాహుల్ ధీమా వ్య‌క్త‌ప‌రిచారు. అదే, తెలంగాణ వ‌ర‌కు వ‌చ్చేస‌రిగా అధికారంలోకి అవ‌కాశం ఉంద‌ని వ్యాఖ్యానించారు. స‌రిగ్గా ఈ పాయింట్ వ‌ద్ద ప్ర‌త్య‌ర్థులు సానుకూలంగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ (Power of Congress) అధికారంలోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం రాహుల్ కు లేద‌ని బీఆర్ఎస్ , బీజేపీ ప్ర‌చారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీకి తెలంగాణ మీద న‌మ్మ‌కం లేన‌ప్పుడు ఎలా అధికారంలోకి వ‌స్తుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

తొలి జాబితాను 70 మందితో విడుద‌ల చేయాల‌ని కాంగ్రెస్

రెండు సార్లు చేజార్చుకున్న అధికారాన్ని ఈసారి ఎలాగైనా అందుకోవాల‌ని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అందుకు త‌గిన విధంగా క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత సానుకూలత కూడా క‌నిపిస్తోంది. అందుకే, ఆచితూచి అభ్య‌ర్థిత్వాల‌ను ఖ‌రారు చేయ‌డానికి ఢిల్లీ కేంద్రంగా క‌స‌రత్తు జ‌రుగుతోంది. కొంద‌రు సీనియ‌ర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్టి ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాలను రంగంలోకి దింపాల‌ని చూస్తోంది. ఆ జాబితాలో జ‌న‌గాం ప్ర‌ధానం గా ఉంది. అక్క‌డ నుంచి పొన్నాల ల‌క్ష్మ‌య్య పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. కానీ, స‌ర్వే ఆధారంగా మ‌రొక‌రికి ఆ టిక్కెట్ ను కేటాయిస్తార‌ని తెలుస్తోంది. అలాగే, న‌ల్లొండ జిల్లా తుంగ‌తుర్తి విష‌యంలోనూ అద్దంకి ద‌యాక‌ర్ కు స‌ర్వేలు సానుకూలంగా ఉండ‌గా, పిడ‌మ‌ర్తి ర‌వికి టిక్కెట్ ను ఇప్పించాల‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప‌ట్టుప‌డుతున్నారు. ఇలా, దాదాపు 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థిత్వాల ఖరారు విష‌యంలో కాంగ్రెస్ (Power of Congress) జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

Also Read : Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ చింతకు ఉరేసుకొని సచ్చినా ధరణి రద్దు చేస్తాం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తొలి జాబితాల‌ను ఈనెల 30వ తేదీన విడుద‌ల చేయ‌డానికి కాంగ్రెస్ రంగం సిద్దం చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 40 స్థానాల్లో అభ్య‌ర్థుల జాబితాను క్లియ‌ర్ గా ఫైనల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. మిగిలిన వాటిల్లో 60 స్థానాల్లో ఇద్ద‌రు, ముగ్గురు అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు. వాళ్ల‌లో ఒక‌ర్ని ఎంపిక చేయ‌డం క‌ష్టంగా మారింది. అందుకే, ఈనెల 29న మ‌రోసారి ఏఐసీపీ స్క్రీనింగ్ క‌మిటీ స‌మావేశం అవుతోంది. ఆ స‌మావేశంలో మ‌రో 30 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. తొలి జాబితాను 70 మందితో విడుద‌ల చేయాల‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. రెండో జాబితాను 30 మందితోనూ, తుది జాబితాను కామ్రేడ్ల‌తో కూడిన పొత్తుపై క్లారిటీ వ‌చ్చిన త‌రువాత వెల్ల‌డిస్తార‌ని తెలుస్తోంది. ఈ టిక్కెట్ల ఎంపిక‌పై నెల‌కొన్ని సందిగ్ధ‌త‌, స‌ర్వేల సారాంశం అందుకున్న రాహుల్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం తెలంగాణ‌లోనూ ఉంద‌ని వ్యాఖ్యానించార‌ని కాంగ్రెస్ చెబుతోంది.

Also Read : TCongress: నాయకత్వ లేమితో బీజేపీ బేజార్, కీలక నేతల చూపు కాంగ్రెస్ వైపు!