హైదరాబాద్ నగరవాసులకు హెచ్చరిక జారీ చేసారు విద్యుత్తు అధికారులు. ఈరోజు (జనవరి 17) నుండి ఫిబ్రవరి 10 వరకు కరెంటు కోతలు ఉంటాయని తెలిపారు. వేసవి/రబీ సీజన్‌లో అధిక విద్యుత్ డిమాండ్‌కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని TSSAPDCL MD ముషారఫ్ అలీ ఫరూఖీ తన (ఎక్స్) వేదికగా వెల్లడించారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ లైన్లను పరిశీలించి అవసరమైతే కొత్తవి వేస్తామని ముషారఫ్ తెలిపారు. కరెంటు కోతలు ఉంటాయని, రోజూ కాదని, ఒక్కో ఫీడర్‌కు ఒక రోజు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 3 వేల బేసి ఫీడర్లు ఉన్నాయని.. నేటి (జనవరి 17) నుంచి 2024 ఫిబ్రవరి 10 వరకు (ఆదివారాలు & పండుగలు మినహా) 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు విద్యుత్‌ను నిలిపివేసి నిర్వహణ పనులు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లోనే కరెంటు కోతలు ఉంటాయన్నారు. విద్యుత్తు అంతరాయాలకు సంబంధించిన వివరాలు https://tssouthernpower.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడతాయని తెలిపారు. మరి దీనిపై బిఆర్ఎస్ ఎలాంటి విమర్శలు చేస్తుందో చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందని..మళ్లీ కరెంట్ కష్టాలు వస్తాయని పదే పదే చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజులకే కరెంట్ కటింగ్ మొదలుకావడం తో బిఆర్ఎస్ చెప్పినట్లే జరుగుతుందని ప్రజలు కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టడం మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
Read Also : Mahesh Babu : మహేష్ లో ఈ టాలెంట్ కూడానా.. బాబోయ్ బాబు మామూలోడు కాదండోయ్..!