తెలంగాణకు ‘పవర్’ క్రైసిస్.. కారణం ఇదేనా!

24 గంటలు విద్యుత్ వెలుగుల విరజిమ్మే తెలంగాణ.. పవర్ క్రైసిస్ ఎదుర్కొనుందా? రాష్ట్రంలోని పల్లెల్లు, పట్టణాలు అంధకారంలోకి నెట్టవేయబడుతాయా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ విద్యుత్ అధికారులు.

  • Written By:
  • Updated On - October 7, 2021 / 04:04 PM IST

24 గంటలు విద్యుత్ వెలుగుల విరజిమ్మే తెలంగాణ.. పవర్ క్రైసిస్ ఎదుర్కొనుందా? రాష్ట్రంలోని పల్లెల్లు, పట్టణాలు అంధకారంలోకి నెట్టవేయబడుతాయా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ విద్యుత్ అధికారులు. వచ్చే వారం నుంచి తెలంగాణలోని పలు థర్మల్ యూనిట్లు తీవ్రమైన బొగ్గు సంక్షోభానికి గురయ్యే అవకాశం ఉన్నందున, రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలు ఒక వారంరోజుల పాటు మాత్రమే థర్మల్ ప్రాజెక్టుల అవసరాలను తీరుస్తాయని తెలంగాణ జెన్‌కో ఉన్నత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలు నాలుగు రోజులు మాత్రమే సరిపోతాయని అధికారులు పేర్కొంటున్నారు.

దేశంలోని పలు థర్మల్ ప్రాజెక్టులకు బొగ్గు ఉత్పత్తి అవసరమైన నేపథ్యంలో.. ఆ అవసరాల కోసం సింగరేణి నుంచి ఉత్పత్తి అయిన బొగ్గును, ఇతర రాష్ట్రాలకు లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని కేంద్రం విద్యుత్ శాఖ తెలిపింది. సింగరేణి నుంచి బొగ్గు తరలిపోయే అవకాశాలు ఉండటంతో తెలంగాణ థర్మల్ విద్యుత్ యూనిట్లు వచ్చే వారం నుంచి బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. థర్మల్ యూనిట్లకు ప్రతిరోజూ దాదాపు 50,000 టన్నుల బొగ్గు అవసరమని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణకు బొగ్గు ఉత్పత్తి ద్వారా కూడా పవర్ జనరేట్ అవుతుంది. బొగ్గు కొరత సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్లలో బొగ్గుగనిపై ఆధారపడక తప్పదు. అయితే రాష్ట్ర విద్యుత్ అవసరాలకు, 60 శాతం పవర్ మాత్రమే ఈ థర్మల్ యూనిట్లు అందిస్తాయి. సరిపడ బొగ్గు నిల్వలు లేకపోతే, తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతాయి. ఒకవేళ తెలంగాణ పవర్ క్రైసిస్ ఎదుర్కొంటే, కేంద్ర విద్యుత్ శాఖ అవసరమైన సాయం కూడా చేయొచ్చు. అయితే తెలంగాణలో పవర్ క్రైసిస్ ఏర్పడుతుందా..లేదా.. అని ఇంకొన్నిరోజులు గడిస్తే కానీ చెప్పలేం.