Prajavani : ప్రజా భవన్ లో ప్రజావాణి వాయిదా..!

Prajavani Programme : ప్రజాభవన్‌లో ఈ నెల 10న జరగాల్సిన ప్రజావాణి వాయిదా పడింది. కేంద్ర ఆర్థిక సంఘంతో భేటీ ఉన్నందున ప్రజావాణి ఈ నెల 11 కు వాయిదా పడింది.

Published By: HashtagU Telugu Desk
Postponement Of Prajavani I

Postponement of Prajavani in Praja Bhavan..!

Prajavani Programme : తెలంగాణలో ప్రజల సమస్యలు తెలిపేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)
ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే భవన్ (ప్రజా భవన్) లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగాలు, భూముల వివాదంపై ప్రజాభవన్‌లో అర్జీలు పెట్టుకుంటారు. అయితే తాజాగా ప్రజాభవన్‌లో ఈ నెల 10న జరగాల్సిన ప్రజావాణి వాయిదా పడింది. కేంద్ర ఆర్థిక సంఘంతో భేటీ ఉన్నందున ప్రజావాణి ఈ నెల 11 కు వాయిదా పడింది.

ఈ నెల 8న రాష్ట్రానికి ఆర్థిక సంఘం సభ్యుల రాక..

సెప్టెంబర్ 8న 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, సభ్యులు రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులతో ఆర్ధిక సంఘం సభ్యులు ప్రజాభవన్‌లో సమావేశం కానున్నట్లు సమాచారం. అర్బన్,రూరల్ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన గ్రాంట్స్, ఆరోగ్య శాఖకు పీహెచ్ సీలకు ఇచ్చే గ్రాంట్లు పెంచాలని, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచాలని ప్రతిపాదనలు ఆర్థిక సంఘానికి చేయనున్నారు.

Read Also: 2024 Khairatabad Ganesh First Pic : శ్రీసప్తముఖ మహాశక్తి గణపతి ఎలా ఉన్నాడో చూడండి

  Last Updated: 06 Sep 2024, 04:30 PM IST