Site icon HashtagU Telugu

Munugodu Politics: చౌటుప్పల్ లో పోస్టర్ల కలకలం

Rajagopal Reddy

Rajagopal Reddy

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ ద్రోహిగా అభివర్ణిస్తూ శుక్రవారం రాత్రి చౌటుప్పల్ ప్రధాన వీధుల్లో పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడీ పోస్టర్లు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజ్‌గోపాల్‌రెడ్డి తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. రాజ్‌గోపాల్ ఆగస్టు 21న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. రాజ్‌గోపాల్‌ బీజేపీలోకి రావడం కొంత మంది కాంగ్రెస్‌ నేతలకు నచ్చలేదు.

22,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని రాజ్‌గోపాల్ మోసగించారని పోస్టర్లలో ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజ్‌గోపాల్‌ బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు అభ్యర్థులను ఖరారు చేసే పనిలోనే ఉన్నాయి. ఈసారి ఉప ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొని ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ సానుభూతిపరుల వేలాది మంది ఓటర్లు కీలకం కానున్నాయి.