Hyderabad : ముద్దపప్పు, బలి దేవతకు స్వాగతం అంటూ పోస్టర్లు..

సోనియాగాంధీని బలి దేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు, అని గతంలోరేవంత్ రెడ్డి అన్న మాటలు పోస్టర్ రూపంలో దర్శనం ఇచ్చాయి

Published By: HashtagU Telugu Desk
Revanth Posters

Revanth Posters

హైదరాబాద్ (Hyderabad) లో అధికార పార్టీ కాకుండా మరో పార్టీ సభ కానీ , సమావేశాలు కానీ జరుగుతున్నాయంటే…వారికీ వ్యతిరేకంగా పోస్టర్లు (Posters) దర్శనం ఇస్తుంటాయి. ఇవి ఈరోజు కాదు గత కొద్దీ నెలలుగా ఇదే నడుస్తుంది. బిజెపి , కాంగ్రెస్ , బిఆర్ఎస్ ఇలా అన్ని పార్టీ లు ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ఫ్లెక్సీ ల రూపంలో ప్రధాన రోడ్ల ఫై , సమావేశాలు జరిగే చోటుగా పెడుతుంటారు. తాజాగా మరోసారి అలాంటి ప్లెక్సీ లే పెట్టి వైరల్ గా మార్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కాంగ్రెస్ CWC సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు సోనియా , రాహుల్ , ప్రియాంక లతో పాటు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

ఈరోజు సమావేశాలు పూర్తి కాగానే సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ (Banjara hills) లో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫొటోతో పోస్టర్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. సోనియాగాంధీని బలి దేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు, అని గతంలోరేవంత్ రెడ్డి అన్న మాటలు పోస్టర్ రూపంలో దర్శనం ఇచ్చాయి. ముద్దపప్పు, బలి దేవతకు స్వాగతం అంటూ వెలిసిన పోస్టర్‌లపై టీకాంగ్రెస్‌లో సర్వత్రా చర్చ నడుస్తోంది. గతంలో రేవంత్‌రెడ్డి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన మాటలను ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నాడు బలి దేవత, ముద్దపప్పు అని మాట్లాడిన రేవంత్‌రెడ్డినే ఈరోజు తెలంగాణ తల్లి అంటూ స్వాగతం పలకడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ముక్కునవేలు వేసుకుంటున్నారు.

Read Also : Congress Manifesto: సోనియా గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్ మేనిఫెస్టో

  Last Updated: 17 Sep 2023, 11:50 AM IST